జగన్ దృష్టిలో నిజంగా చంద్రబాబు… చంద్రుడే అన్ని అంటున్నారు పరిశీలకులు. అలా అని వెన్నెల కురిపిస్తాడు అని కాదు… స్వయంప్రాకాశితం కాదు అని! రామోజీ అనే సూర్యుడి నుంచి చంద్రబాబు కాంతిని స్వీకరించి రాత్రుళ్లు ప్రకాశిస్తాడని జగన్ ఉద్దేశ్యం అని చెబుతున్నారు. ఎందుకనేది ఇప్పుడు చూద్దాం!
జగన్ తన ప్రసంగాల్లో ముసలాయన అని అంటూ చంద్రబాబుని.. దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని పవన్ కల్యాణ్ ని, వారితో పాటు రామోజీరావు, రాధాకృష్ణని కలిపి దుష్టచతుష్టయం అని విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో జగన్ దృష్టిలో చంద్రబాబు అసలు శత్రువు కాదు… రామోజీయే అసలు శత్రువు అని అంటున్నారు విమర్శకులు.
అవును… తాజాగా ప్రభుత్వం జారీచేసిన యాడ్స్ తో తన అసలు ప్రత్యర్థి రామోజీ రావే అనే విషయాన్ని జగన్ స్పష్టంగా ప్రకటించారని అంటున్నారు పరిశీలకులు. అందుకు కారణం తాజాగా మార్గదర్శి విషయంలో జగన్ సర్కార్ తీసుకున్ని నిర్ణయమే అని అంటున్నారు. ఫలితంగా… రామోజీ రావు ఆర్థిక మూలలను ఒక చూపు చూసేస్తే… బాబు అటోమెటిక్ గా కుంటివాడైపోతాడనేది జగన్ ఉద్దేశ్యమనేవారూ ఉన్నారు.
తాజాగా మార్గదర్శికి వ్యతిరేకంగా ప్రభుత్వం కొన్ని దినపత్రిల్లో ఫుల్ పేజి యాడ్స్ ఇచ్చింది. అందులో మార్గదర్శి యాజమాన్యం చేసిన.. చేస్తున్న అవినీతి, అక్రమాలను పాయింట్ల రూపంలో ఇచ్చింది. చందాదారుల సంక్షేమానికి కట్టుబడి ఉండటం వల్లే ప్రభుత్వం మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐడీ ప్రకటించింది. ఇకపై ఎవరూ మార్గదర్శిలో చిట్ లు వేసి ఇబ్బంది పడోద్దని పరోక్షంగా సూచించింది.
దీంతో… రామోజీ ఆర్థిక మూలాలను సమూలంగా పెకలించటమే జగన్ టార్గెట్ గా అర్థమవుతోందని అంటున్నారు పరిశీలకులు. తన అసలు ప్రత్యర్థి రామోజీయే కానీ చంద్రబాబునాయుడు ఎంతమాత్రం కాదని చెప్పకనే చెప్పినట్లయ్యిందని చెబుతున్నారు. చంద్రబాబు కూడా రామోజీ చెప్పినట్లు ఆడుతున్న వ్యక్తేకానీ.. స్వయం ప్రకాశితమైన నేత కాదని జగన్ గ్రహించారని ఈంటున్నారు.
దీంతో… రాజకీయంగా చంద్రబాబును దెబ్బకొడితే రామోజీకి ఏమీ నష్టం ఉండదు కానీ… రామోజీని ఆర్థికంగా, మానసికంగా దెబ్బకొడితే మాత్రం దాని ప్రభావం చంద్రబాబు మీద కచ్చితంగా పుష్కలంగా ఉంటుందని జగన్ గ్రహించారని చెబుతున్నారు. దీంతో… ప్రస్తుతం జగన్ అదే పనిలో ఉన్నారని… పైగా మార్గదర్శిలో రామోజీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయని సీఐడీ పక్కాగా చెబుతున్న తరుణంలో జగన్ పూర్తిగా శ్రద్ధ పెట్టారని అంటున్నారు.
అవును… ఎవరు అవునన్నా కాదన్నా మార్గదర్శిలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని అంటున్నారు ఉండవల్లి లాంటి మేధావులు! తాజాగా గత కొంతకాలంగా ఏపీ సీఐడీ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించిందని చెబుతున్నారు. దీంతో… మార్గదర్శిని గనుక దెబ్బకొడితే రామోజీ గ్రూపు మొత్తం కుప్పకూలిపోతుందని అంటున్నారు. దీంతో… ఏపీ సీఐడీ వారి పని వారి పని వారు చేస్తుంటే… మరోపక్క జనాలను అలర్ట్ చేసే పనిలో జగన్ ఉన్నారన్ని చెబుతున్నారు.
ఏది ఏమైనా… రాబోయే ఎన్నికల్లో యుద్ధం చేయాల్సింది ఎల్లో మీడియా యాజమాన్యాలతోనే కానీ చంద్రబాబుతో కాదని జగన్ కు బాగా తెలిసిందని.. అందుకనే నేరుగా రామోజీపై యుద్ధానికి దిగారని అంటున్నారు. మరి ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది వేచి చూడాలి.