R.K: రాజకీయాలు ఎప్పుడు కూడా రాజకీయాలు మాదిరిగా చేస్తేనే భవిష్యత్తు ఉంటుంది. అలా కాదని కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం కక్షపూరిత రాజకీయాలు చేస్తూ భారీ మూల్యం చెల్లించుకున్నారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కనుక అలాగే వదిలివేసి ఉంటే ఈరోజు ఆయన నాయకుడు అయ్యేవారు కాదు కానీ తనని జైల్లో పెట్టడం వల్ల ముఖ్యమంత్రిగా కొనసాగారు.
తన విషయంలో జరిగిన తప్పు నుంచి జగన్ పాఠం నేర్చుకోలేదని చెప్పాలి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే స్థాయిలో కక్ష సాధింపు రాజకీయాలు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనపై వ్యతిరేకత వచ్చింది కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుని జైలుకు పంపించారో ఆ క్షణమే ఆయన గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందనే చెప్పాలి. అలా చంద్రబాబు నాయుడుని జైలుకు పంపించడంతో నేడు ప్రతిపక్ష నేత హోదా కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇలా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ చంద్రబాబు దోస్తీ ఆర్కే మాత్రం ఆయనకు సరికొత్త సలహాలు ఇస్తున్నారు. ఏపీలో వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేయాలన్నది టిడిపి అనుకూల మీడియా అధిపతి ఆర్కే ఆలోచన. అధికారంలోకి చంద్రబాబు నాయుడు వచ్చి ఏడు నెలలు అవుతున్న ఇప్పటివరకు చంద్రబాబు వైసీపీని నిర్వీర్యం చేయటంలో విఫలమయ్యారని తెలిపారు.
జగన్ హయాంలో వ్యవస్థలను వాడుకున్నారని… వ్యవస్థల ద్వారానే రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారాలకు దిగారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు అదే పని చేయటం లేదని ప్రశ్నించారు. గతంలో దాదాపు ఓ పదిమంది అధికారులు జగన్ కోసం ఏ పని చేయడానికి అయినా సిద్ధంగా ఉండేవారు. కానీ ప్రస్తుతం మాత్రం అధికారులు చంద్రబాబు నాయుడుకి తెలియకుండా ఎన్నో పనులు చేసేస్తున్నారు.
ఇది ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలలో చినబాబు లోకేష్ కు కష్టమవుతుందని ఆర్కే రెచ్చగొట్టే ప్యాకేలు చేస్తున్నా కానీ ఈ విషయంలో చంద్రబాబుకు కూడా ఫుల్ క్లారిటీ ఉందని ఆయన ఆలోచన విధానాలు తనిఖీ ఉన్నాయని తెలుస్తోంది. జగన్ చేసిన పనిని తాను కూడా చేస్తే వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే ఎంతో చాకచక్యంగా జగన్ కు చెక్ పెట్టే ఆలోచనలు బాబు ఉన్నారని తెలుస్తోంది. జగన్ చేసిన పని చంద్రబాబు చేస్తే ప్రస్తుతం జగన్ మూల్యం చెల్లించుకున్నట్టు బాబు కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది మరి ఇలాంటి సలహాలను ఆర్కే ఇవ్వడం వెనుక కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.