రామోజీని కలిసిన నడ్డా.. ట్రోల్లింగ్ మామూలుగా లేదుగా!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జాతీయ స్థాయిలోని బీజేపీ నేతల దృష్టంతా ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలపైనే ఉందని అంటున్నారు. పైగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ తో ఈసారి ఈ రెండు దక్షిణాది రాష్ట్రాలపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఏపీలో అంతసానుకూల వాతావారణం ఉన్నట్లు కనిపించనప్పటికీ… తెలంగాణలో మాత్రం హోప్స్ ఎక్కువగానే పెట్టుకున్నారు.

మరోపక్క ఏపీలో జనసెనతో కలిసి ఎన్నికలకు వెళ్తారని, ఫలితంగా ఎంతో కొంత ప్రభావం చూపించొచ్చని, అధికార వైసీపీకి ప్రత్యామ్నాయంగా ఎదగొచ్చని ప్లాన్స్ వేసినప్పటికీ… పవన్ వాటికి చిదిమేశారని అంటునారు. మరోపక్క స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.

పైగా… చంద్రబాబు అరెస్ట్ వెనుక జగన్ కు కేంద్రంలోని బీజేపీ పెద్దల సహాయ సహకారాలు ఉన్నాయనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ పెద్దలు మోడీ, అమిత్ షా లకు తెలియకుండా జగన్ అంత పెద్ద స్టెప్ తీసుకోరని చెబుతున్నారు. పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఇదే కామెంట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యలో తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు జేపీ నడ్డా. ఈ సందర్భంగా రామోజీ రావు, రాధాకృష్ణలను కలిశారు. వీరిద్దరితోనూ విడి విడిగా చాలా సేపు భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను జేపీ నడ్డా స్వయంగా తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. ఈ సమయంలో రామోజీ చాలా యాక్టివ్ గా కనిపించారు.

దీంతో… ఈ భేటీపైనా, ఈ సందర్భంగా రామోజీ యాక్టివ్ గా కనిపించడంపైనా.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడూతూ రామోజీని ట్రోల్స్ చేస్తున్నారు. సీఐడీ అధికారులు వచ్చినప్పుడు రామోజీ మంచంపై పడుకున్న ఫొటోల్ని షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

మార్గదర్శి చిట్ ఫండ్స్ కి సంబంధించిన కేసులో సీఐడీ అధికారులు ఇంటికి వస్తే నడుముకి బెల్ట్ పెట్టుకుని, మంచంపై పడుకున్న రామోజీ రావు… ఇతరులు ఎవరైనా వస్తే మాత్రం ఇలా కుర్చీలో కూర్చుని యాక్టివ్ గా కనిపిస్తారంటూ ఫోటోలు పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.