371 కోట్లు కొట్టేశారు.! స్కిల్ ఇలా చూపించారు.!

నైపుణ్యాభివృద్ధి.! దేంట్లో.? 371 కోట్లు కొట్టేయడంలో.! ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముసుగులో జరిగింది ఇదేనట. మొత్తం 3300 కోట్ల రూపాయల ప్రాజెక్టులో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటా కింద చెల్లింపులు జరిగింది 371 కోట్ల రూపాయలట. దక్కించుకున్నది సీమెన్స్ సంస్థ.

ఇంతకీ, సీమెన్స్ సంస్థ పెట్టిన పెట్టుబడి ఎంత.? జీరో. నిజానికి, పెట్టాల్సిందెంత.? రెండు వేల ఏడొంద కోట్లకు పైనే.! అట్నుంచి పెట్టుబడులు రాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ముందే ఎలా చెల్లింపులు చేసిందట.? అదే చంద్రబాబు మార్కు మ్యాజిక్కు.! అదే చంద్రబాబుని ఈ రోజులు అరెస్టయ్యేలా చేసిందని అంటున్నారు.

సీమెన్స్ సంస్థ ముసుగులో డిజైన్ టెక్ సంస్థ ద్వారా షెల్ కంపెనీలకు రెండొందల నలభై కోట్లకు పైనే వెళ్ళాయట. సీమెన్స్ సంస్థకి ఓ వంద కోట్లు.. ఆ పైన దక్కాయట. ఇదీ సీఐడీ విచారణలో తేలిన అంశం. జీఎస్టీ అధికారులు, లెక్కల్లో తేడాలు రావడంతో ఈ మొత్తం కుంభకోణం వెలుగు చూసింది.

‘అబ్బే, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో మంచి చేయాలని అనుకున్నాం..’ అని అంటోంది టీడీపీ. ‘నేను ఏ పాపమూ ఎరుగను’ అంటున్నారు చంద్రబాబు. అవన్నీ కోర్టులో తేలతాయ్. ‘నన్నెవరూ అరెస్టు చేయలేరు.. నేను నిప్పు..’ అని నీలిగిన చంద్రబాబు, ఇప్పుడు జైలుకు వెళ్ళక తప్పేలా లేదు.

చంద్రబాబు తన లీగల్ టీమ్ మొత్తాన్నీ రంగంలోకి దించి, బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారట. కానీ, బెయిల్ వస్తుందా.? రాదా.? ప్రస్తుతానికైతే అది సస్పెన్స్. కానీ, స్కిల్ డెవలప్మెంట్ పేరుతో, స్కామ్ చేసిన చంద్రబాబు వ్యవహారం మాత్రం సోషల్ మీడియా వేదికగా బద్దలైపోతోంది.!

షెల్ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు.. అంటూ పదే పదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ ఇన్నాళ్ళూ నానా యాగీ చేసింది. ఇప్పుడు అదే షెల్ కంపెనీలతో ఇరకాటంలో పడిపోయారు చంద్రబాబు. కర్మ ఈజ్ బ్యాక్ అంతే.!