చంద్ర‌బాబుతోనే ఆ విష‌యం గురించి చెప్పిస్తానంటున్న అఖిల ప్రియ‌

తెలుగు దేశం పార్టీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రాయ‌ల‌సీమ‌లో రాజ‌ధాని అంశం పై స్పందిస్తూ టీడీపీ విధాన‌మేంటో తెల‌పాలంటూ హైకోర్టుకు వెళ్ళారు. ఈ అంశానికి సంబంధించి టీడీపీ ఆఫీసులో విలేక‌రుల స‌మావేశం జ‌రుగుతుండ‌గా… ఆమెను రాయ‌ల‌సీమ విద్యార్ధులు, జెఏసీ నేత‌లు అడ్డుకున్నారు. రాయ‌ల‌సీమ అభివృద్ధి చెంద‌డం టీడీపికి ఇష్టం లేద‌ని అఖిల ఆరోపించారు.

అన్ని కామెంట్లు చూడండి మీ కామెంట్ రాయండి విద్యార్థి సంఘాల నేతలకు అఖిలప్రియ కూడా కాస్త గ‌ట్టిగానే కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయడానికి వ్యతిరేకం కాదని.. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని చెప్పారు. కానీ రాయలసీమకు ఇంకా న్యాయం చేకూర‌లేద‌ని తమ పార్టీ స్టాండ్ అన్నారు. అఖిలప్రియ వ్యాఖ్యలపై స్పందించిన జేఏసీ నేతలు.. చంద్రబాబు రాజధాని మార్పు మీద ఆయ‌న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని మళ్లీ వాదించారు. దీంతో అమరావతికి తనతో పాటూ వస్తే.. చంద్ర‌బాబుతోనే స్వ‌యంగా అఖిల చెప్పిస్తానన్నారు. ఆ పక్కనే ఉన్న జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు సర్థిచెప్పడంతో పరిస్థితి కాస్త‌ సద్ధుమణిగింది.

అంతకుముందు ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన అఖిలప్రియ.. మూడు రాజధానుల ప్రకటన పై స్పందించారు. జగన్ తనకు అనుకూలంగా జీఎన్.రావు కమిటీతో నివేదిక ఇప్పించారని ఆరోపించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోందని.. మూడు రాజధానుల ప్రకటతో రాష్ట్రంలో గందరగోళం ఏర్పడిందన్నారు. విశాఖలో సచివాలయం ఏర్పాటు చేస్తామంటున్నారని.. రాయలసీమ నుంచి విశాఖకు రోడ్ కనెక్టివిటీ ఉందా అని ప్రశ్నించారు. అక్కడికి వెళ్లాలంటే సామాన్యులు ఇబ్బందిపడాలని.. దీనిపై పునరాలోచన చేయాలన్నారు. ఇలా ఏదో మంచి అడుగులు వేస్తున్నాం క‌దా అని చేయ‌డం కాదు కాస్త ఆలోచ‌న ఉండాల‌ని అన్నారు. ఇక ఇదిలా ఉంటే గ‌తంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే తమపై కేసులు పెట్టి వేధిస్తున్నారని అఖిలప్రియ ఆరోపించారు. అఖిలపక్ష పర్యటనలో భాగంగా యురేనియం ఫ్యాక్టరీ బాధితులను కలిసేందుకు పులివెందుల వెళ్లి వచ్చినప్పటి నుంచే కేసులతో ఇబ్బందులు పెడుతున్నారన్నారు. తనను ఇబ్బంది పెట్టే వారిని ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు.