Akhila Priya: గత మూడు రోజులుగా మంచు కుటుంబంలో పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకున్నాయి. ఇలా మోహన్ బాబు పై మనోజ్ దాడి చేశారని మనోజ్ పట్ల మోహన్ బాబు దాడి చేయించారంటూ వార్తలు వస్తున్నాయి అలాగే పోలీస్ స్టేషన్లో ఒకరిపై మరొకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు ఇక ఇద్దరు కూడా మీడియా సమావేశాలలో పాల్గొంటూ సంచలన విషయాలు బయటపెడుతున్నారు.
ఇలా గత మూడు రోజులుగా మంచు కుటుంబంలో చోటు చేసుకున్న ఈ గొడవలు ఇప్పుడే సర్దుమనిగే అవకాశాలు కూడా లేవని స్పష్టమవుతుంది. ఇలాంటి తరుణంలో భూమా మౌనికకు తన కుటుంబం నుంచి మద్దతు లభిస్తుందని అందరూ భావించారు కానీ ఇప్పటివరకు ఈ గొడవపై భూమా మౌనిక కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా స్పందించలేదు.
నిజానికి భూమా మౌనిక తల్లిదండ్రులు లేరు ఇక తన అక్క ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇలా ఎమ్మెల్యేగా తన అక్క అండగా మౌనికకు నిలిచిన కొంతమేర ఉపశమనం కలుగుతుంది కానీ భూమా అఖిల ప్రియ మాత్రం ఇప్పటివరకు ఈ గొడవలపై ఎక్కడ స్పందించలేదు. ఈ గొడవ గురించి రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి అలాంటిది ఎమ్మెల్యే అయినటువంటి అఖిలప్రియకు ఈ గొడవ తెలిసి ఉండదు అనటం హాస్యాస్పదం.
ఇలా తన చెల్లెలు చెల్లెలు భర్త ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భూమా అఖిల ప్రియ మాత్రం స్పందించకపోవడంతో మౌనికకు భూమా అఖిల ప్రియకు కూడా విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది. నిజానికి మంచి విష్ణు భూమా మౌనికల వివాహం రెండు కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకనే వీరిద్దరూ ప్రేమలో ఉన్న పెద్దల అంగీకారం కోసం తరుచు తమ పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. చివరికి మనోజ్ అక్క మంచు లక్ష్మీ ప్రమేయంతో ఈ వివాహం జరిగింది.
ఇలా వివాహం చేసుకుని ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట ఇప్పుడు ఆస్తి విషయంలో గొడవలు పడుతున్నారు. మరి ఈ విషయంపై భూమా అఖిల ప్రియ స్పందిస్తారా లేకపోతే మౌనం పాటిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఇటు అత్తింటి వారు అటు పుట్టింటి వారు మద్దతు లేక మౌనిక తన భర్త మాత్రమే ఒంటరి పోరాటం చేస్తున్నారు.