అఖిల ప్రియ. ఏపీ మాజీ మంత్రి. కానీ.. తెలంగాణలో ఓ కేసు విషయమై అడ్డంగా బుక్కయ్యారు. తన తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో ప్రస్తుతం ఒంటరి అయిపోయారు అఖిల ప్రియ. అప్పుడంటే బాబు చేరదీశారు.. మంత్రిని చేశారు కానీ.. ప్రస్తుతం ఏపీలో టీడీపీ అధికారంలో లేదు. అప్పుడు జగన్ మీద ఉన్న కోపంతో.. భూమా ఫ్యామిలీని చంద్రబాబు దగ్గరికి తీశారు కానీ.. లేకపోతే.. ఆయన అసలు ఆ ఫ్యామిలీని పట్టించుకునేవారే కాదు.
ఇప్పుడు చంద్రబాబుకు భూమా ఫ్యామిలీని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినప్పటి నుంచి భూమా ఫ్యామిలీని చంద్రబాబు పట్టించుకోవడం లేదు.. అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అఖిల ప్రియ ఉన్న పరిస్థితుల్లో ఆమెను కాపాడేవారు ఎవరు? అనే ప్రశ్న తలెత్తుతోంది.
తనకు ఇంత పలుకుబడి ఉన్నా.. చంద్రబాబు అండదండలు ఉన్నా.. మాజీ మంత్రి అయినా కూడా ఒక కిడ్నాప్ కేసులో ఏ1 నిందితురాలుగా ఉండి జైలు గడప తొక్కారంటూ.. ఆమె పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆమె జైలులో ఉన్నా.. టీడీపీ నేతలు కానీ.. చంద్రబాబు కానీ.. టీడీపీ అభిమానులు కానీ.. ఒక్కరూ ఏమాత్రం స్పందించడం లేదు.
భూమా ఫ్యామిలీ చాలా ఏళ్ల పాటు జగన్ తో కలిసి నడిచారు. వైసీపీలో ఉన్నారు. తర్వాత చంద్రబాబు ఆశ చూపించడంతో.. టీడీపీలో చేరారు. వాళ్లు అలాగే వైసీపీలోనే ఉండిపోతే… ప్రస్తుతం భూమా అఖిల ప్రియకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
టీడీపీ నుంచి అండదండలు లేక.. బయటికి నుంచి మద్దతు లేక.. ప్రస్తుతం అఖిల ప్రియ పరిస్థితి అగమ్యగోచరంగా తయారయినట్టుగానే ఉంది పరిస్థితి. చూడాలి మరి.. అఖిల ప్రియ ఇప్పటికైనా ఎవరు ఎటువంటి వాళ్లో తెలుసుకొని భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో?