ప్రపంచాన్ని గుప్పిట బిగించి వణికిస్తోన్న కరోనా మహమ్మారి ప్రభావం సుదీర్ఘకాలం ఉంటుందని తేలిపోయింది. అదుపులోకి వచ్చినట్లే కనిపించినా మళ్లీ విజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. రానున్న కాలంలో కరోనా పెద్ద ఎత్తున వ్యాపించే అవకాశాలున్నందున తప్పు చేయొద్దని చెప్తోంది.
దేశాలకు దేశాలే లాక్ డౌన్లోకి వెళ్లిపోయి ప్రపంచ వ్యాప్తంగా ప్రజా జీవనం స్తంభించినపోయింది. దీని వల్ల భవిష్యత్తులో మరిన్ని తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న అంఛనాలతో లాక్ డౌన్ సడలింపు దేశాగా భారత దేశం సహా అన్ని దేశాలు ఆలోచిస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పిడుగులాంటి వార్త చెప్పింది.
కరోనా తీవ్రతను గుర్తించి, అప్రమత్తం చేయడం, కరోనాను నియంత్రించడంలో విఫలమైన డబ్య్లుహెచ్ఓ.. తన చర్యలను సమర్థించుకోవడానికి పరిమితమైంది. ఆదిలోనే గుర్తించామని, అన్ని చర్యలు చేపట్టామని అంది. నిమ్మలంగా కరోనా సుదీర్ఘంగా ఉంటుందని, ఎవరికి వారే జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.
ఇక ఇప్పటికే కరోనా తీవ్రతను చూస్తే.. ప్రపంచ వ్యాప్తంగా 26 లక్షల మంది కరోనా వ్యాధి భారిన పడగా, వారిలో 1.8 లక్షల మంది చనిపోయారు. ఇది కేవలం అధికారిల లెక్కలు కాగా.. ఈ సంఖ్య ఇందుకు రెట్టింపు స్థాయిలో ఉండొచ్చు అన్న అనుమానాలు ఉన్నాయి.