ఏపీ మంత్రి పేషీలో కరోనా కలకలం

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1332 కేసులు నమోదుకాగా.. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖా మంత్రి పేషీలో కరోనా కలకలం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంన్నా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. మొన్నటి వరకు ఒక్క కేసు కూడా నమోదుకానీ శ్రీకాకుళం జిల్లాలో సైతం ఇప్పుడు కరోనా కేసులు నమోదవ్వడం ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేషీలో ఓ అటెండర్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా లక్షణాలతో బాధ పడుతున్న అటెండర్‌కి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని‌ వచ్చిందన్నారు. తుది నిర్ధారణ కోసం శాంపిల్స్‌ను వైరాలజీ ల్యాబ్‌కి పంపారు. అటెండర్‌ను పిన్నమనేని సిద్దార్ధ వైద్య కళాశాలకు తరలించారు.

అటెండర్‌కు కరోనా రావడంతో పేషీలోని ఇతర ఉద్యోగులు ఇప్పుడు భయపడిపోతున్నారు. పేషీలో శానిటైజేషన్ చర్యలు చేపట్టారు. భద్రతా సిబ్బంది సహా మరో 12 మందికి పరీక్షలు నిర్వహించగా.. వారికి నెగెటివ్ వచ్చింది. అయితే కరోనా నిర్ధారణ కావడానికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నందున సెల్ఫ్ క్వారెంటైన్‌‌లో ఉండనున్నారు.