మొత్తానికి విడాకుల గుట్టు విప్పిన రేణూదేశాయ్

రేణూ దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటానని ప్రకటించినప్పటి నుంచి ఆమె పవన్ అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్య నిశ్చితార్ధం జరిగిందని ప్రకటించిన తర్వాత రేణూ మీద పవన్ అభిమానుల విమర్శల దాడి ఎక్కువైంది. పవన్ అభిమానుల విమర్శల వర్షంతో ఆమె ఇటీవల ట్విట్టర్ నుంచి వైదొలిగారు. రహస్యంగా నిశ్చితార్ధం చేసుకున్న రేణూ తాను అలా ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రేణూ దేశాయ్…

“గత సంవత్సరం నేను పెళ్లి చేసుకోవాలని ఆలోచించాను. ఆ విషయం చెప్పగానే చాలా విమర్శలు వచ్చాయి. నిన్ను, నీకు కాబోయే భర్తను చంపేస్తాం అంటూ పవన్ అభిమానులు సోషల్ మీడియాలో హెచ్చరించారు.ఆ బెదిరింపులకు భయపడవద్దని చాలా మంది చెప్పారు. కానీ నేను పట్టించుకోకుండా ఉండలేక పోయాను. నాకు కాబోయే భర్తకు హానీ జరగకూడదనే ఆయన ఎవరనేది చెప్పలేదు. ఆయన సినిమా రంగానికి చెందిన వ్యక్తి మాత్రం కాదు. ఆయన ఎవరనేది పెళ్లి తర్వాత చెబుతాను” అని రేణూ దేశాయ్ నిశ్చితార్థపు రహస్యాన్నితెలిపింది.