నీటి యుద్ధాలపై యంగ్ డైరెక్టర్ వార్నింగ్!
మెట్రో నగరాల్లో నీటి యుద్ధం జరగబోతోందా? కనీస అవసరాల కోసం నగరాలన్నీ హాహా కారాలు చేయాలల్సిందేనా? అంటే జరుగుతున్న పరిణామాలు అందుకు అద్దం పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మెట్రో నగరాలు ఢిల్లీ , ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నీటి కోసం అల్లాడుతున్నాయి. కనీస అవసరాలకు కూడా ఎదురుచూడాల్సి వస్తోందంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. 2018 ఎండా కాలంలో రోజంతా నగారినికి సరిపడా వాటర్ అందుబాటులో వుండగా ప్రస్తుతం మాత్రం అర గంట మాత్రమే వాడుకునేంతగా వాటర్ లెవెల్స్ తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా మహానగరాలన్నీ నీటి సమస్యతో కటకటలాడుతున్నాయి. దీనికి పరిష్కారాన్ని కనుగొని పాటించకపోతే భవిష్యత్ అంధకారమే నని పలు స్వచ్ఛంద సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
దీని కోసం యంగ్ డైరెక్టర్, `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ సోషల్ మీడియా ద్వారా వాటర్ యుద్ధం మొదలుపెట్టడం ఆసక్తికరంగా మారింది. మరో 43 రోజుల్లో హైదరాబాద్ నగరానికి నీటి కష్టాలు రాబోతున్నాయి. దాన్ని తట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు తమ దిన చర్యను ఒకే ఒక బక్కెట్‌తో ముగించి నీటిని ఆదా చేయాలని బక్కెట్ ఛాలెంజ్ పేరుతో సోషల్ మీడియా వేదికగా నాగ్ అశ్విన్ ప్రచారం చేస్తున్నారు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ బోర్ లు ఎక్కువైపోయాయి. దాంతో భూగర్భ జలాలు కూడా అడుగంటి పోయాయి. 1500 ఫీట్లు వెళ్లితేనే వాటర్ పడే పరిస్థితి. ఈ సరిస్థితి మారాలంటే ప్రభుత్వం కొత్త వాటర్ పాలసీని తీసుకురావాలి. నిబంధనల్ని కఠనతరం చేయాలి. అప్పుడే భూగర్భ జలాలు అడుగంట కుండా వుంటాయి. దీనికి అంతా సహకరించాలి` అంటూ కొత్త ఉద్యమానికి తెరలేపారు. మరి నాగ్అశ్విన్ పిలుపుని ఎంత మంది పాటిస్తారో చూడాలి. ఈ తరహాలో ఇతర సెలబ్రిటీలు జాతిని జాగరూకత చేయడం ఎంతో అవసరం. లేదంటే మునుముందు పెనుముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది.