పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సహ నటి దీపికా పదుకోన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. ఆమె బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ అని, ఆమె అంటే ఎప్పటికీ తనకు అభిమానమేనని కొనియడారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ’కల్కి 2898 ఏడీ’ సినిమాలో నటిస్తున్నారు. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ప్రభాస్ అంతర్జాతీయ విూడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో దీపిక గురించి పలు ప్రశ్నలు అడగగా ఆయన ఆసక్తికర విషయాలు మాట్లాడారు. దీపికా అందమైన, అద్భుతమైన నటి.
ఇప్పటికే ఆమె ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. ’కల్కి’ సెట్స్‌లోకి ఆమె అడుగుపెట్టిన ప్రతిసారి అందరిలోనూ ఉత్సాహం వస్తుంది. ఆమెతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ చిత్రంతో కుదిరిందని అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ చిత్రం టైటిల్‌ను అమెరికాలోని ’శాన్ డియాగో కామిక్ కాన్’లో ప్రకటించారు. అక్కడ విడుదల చేసిన టీజర్‌కు విశేష స్పందన వచ్చింది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.