సామ్ జామ్ హంగామా.. సెకండ్ ఎపిసోడ్‌లో గెస్ట్‌లు ఎవ‌రంటే!

క‌రోనా వ‌చ్చాక సినీ రంగంలో ప‌రిస్థితులు పూర్తిగా మారాయి. నిర్మాత‌లే కాక జ‌నాలు కూడా ఓటీటీల‌కు కూడా బాగా క‌నెక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్లాట్ ఫాం వెరైటీ ప్రోగ్రాంస్‌ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఇక హండ్రెడ్‌ పర్సెంట్‌ తెలుగు ఓటీటీ ‘ఆహా’‌. సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా మాధ్యమం స‌మంత హోస్ట్ గా సామ్ జామ్ అనే కార్య‌క్ర‌మం రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

సామ్ జామ్ ముఖ్య ఉద్దేశం స‌మాజంలోని స‌మ‌స్య‌ల గురించి ప్ర‌శ్నించ‌డం, కొత్త టాలెంట్‌ని ఎంక‌రేజ్ చేయ‌డం . ఇటీవ‌ల మొద‌లైన సామ్ జామ్ ఎపిసోడ్‌కు మొద‌ట విజ‌య్ దేవ‌ర‌కొండ హాజ‌ర‌య్యారు. ఈ కుర్ర హీరో చేసిన రచ్చ అంతా ఇంతా లేదు. షొలో స‌మంత‌ని త‌ప్ప అంద‌రు హీరోయిన్స్‌ని ముద్దు పెట్టేసా అని చెప్పాడు. ఇక ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి కూడా సామ్ జామ్ కార్య‌క్ర‌మానికి హోస్ట్‌గా హాజ‌రు కాగా, ఆయ‌న‌కు సంబందించిన ఫోటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేశాయి.

ఇక రెండో ఎపిసోడ్‌లో ఎవ‌రు హాజ‌రు అవుతారా అని అంతా ఆశ‌గా ఎదురు చూస్తున్న క్ర‌మంలో సర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. మ‌హాన‌టితో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్, బాహుబ‌లి సినిమాతో త‌న క్రేజ్‌ని దేశ విదేశాల వ‌ర‌కు తీసుకెళ్ళిన భ‌ళ్ళాల దేవుడు రానా. వీరిద్ద‌రితో స‌మంత సామ్ జామ్ స‌ర‌దాగా సాగ‌నుంది. వీరిద్ద‌రితో స‌మంత ఎలాంటి ఏమేం గేమ్స్ ఆడిస్తుంది. ఎలాంటి ప్ర‌శ్న‌లు అడుగుతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.