ప్ర‌భాస్ – నాగ్ అశ్విన్ చిత్రం పాన్ ఇండియా కాదా?

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో ప్ర‌భాస్ చేయ‌బోతున్న తాజా చిత్రాన్ని చిత్ర బృందం బుధ‌వారం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేప‌థ్యంలో అత్యంత భారీ స్థాయిలో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని `మ‌హాన‌టి` ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌పైకి తీసుకురాబోతున్నారు. అయితే ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో వుంటుంద‌ని, ఎవ‌రూ ఊహించ‌ని స‌రికొత్త నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నార‌ని ప్ర‌చారం మొద‌లైంది.

అయితే ఈ ప్ర‌చారంపై ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ సోష‌ల్ మీడియా వేదిక‌గా క్లారిటీ ఇచ్చారు. `ఈ ఏడాది చివ‌ర‌లో సినిమా మొద‌ల‌వుతుంద‌ని, బ‌హుషా వ‌చ్చే ఏడాది చివ‌ర‌లో సినిమా రిలీజ్ వుండొచ్చు. దీని గురించి ఇప్పుడే చెప్ప‌డం టూ ఎర్లీ అవుతుంది. బిగ్ థ్యాంక్స్ టు ప్ర‌భాస్ గారు. కొంత మంది ఇది పాన్ ఇండియా ఫిల్మ్ అంటున్నారు. అది త‌ప్పు. పాన్ ఇండియా ఎప్పుడో కొట్టేశారు. ఇది పాన్ వ‌ర‌ల్డ్ డార్లింగ్స్‌..`అని నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. అంటే పాన్ వ‌ర‌ల్డ్ అంటే `బాహుబ‌లి`కి మించి ఈ సినిమా వుండ‌బోతోందా?.