ఓవర్సీస్‌లో వంద కోట్లు బిజినెస్‌ పై ప్రభాస్‌ కన్ను!

రిలీజ్‌కి దగ్గర పడుతుంటే ఔట్‌పుట్‌ ఎలా వచ్చింది? సెన్సార్‌ ఏం ఇచ్చింది? అనే విషయాల మీద ఎంత కాన్‌సెన్‌ట్రేషన్‌ ఉంటుందో, ఏరియాల వైజ్‌ బిజినెస్‌ ఎంత జరుగుతోంది? ఈ హీరోకి ఆయా ఏరియాల్లో ఎంత మార్కెట్‌ ఉంది? ఇంతకు ముందు అక్కడ ఏ సినిమాలు టాప్‌ రేంజ్‌లో బిజినెస్‌ చేశాయి… అనే విషయాల మీద కూడా ఇంట్రస్ట్‌ అదే రేంజ్‌లో ఉంటుంది. ఇప్పుడు ‘కల్కి’ విషయంలో సేమ్‌ డిస్కషన్‌ షురూ అయింది.

తెలుగు సినిమాల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ట్రిపుల్‌ ఆర్‌ని ఇగ్నోర్‌ చేయలేం. దాదాపు 450 కోట్ల బిజినెస్‌ చేసి చూపించి అందరి చేతా వావ్‌ అనిపించారు జక్కన్న. తారక్‌, చెర్రీ హీరోలుగా నటించిన ట్రిపుల్‌ ఆర్‌ కు ప్రీ రిలీజ్‌ క్రేజ్‌ మామూలుగా లేదు. ఆ కరిష్మాని క్యాష్‌ చేసుకున్నారు మేకర్స్‌.

ఇప్పుడు అంతకు మించిన క్రేజ్‌ మాకుంది అని అంటున్నారు కల్కి ప్రొడ్యూసర్స్‌. ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ స్టామినాను కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లతో ప్రూవ్‌ చేస్తామంటున్నారు. ఒక్క ఓవర్సీస్‌లోనే దాదాపు 100 కోట్లకు పైగా బిజినెస్‌ని టార్గెట్‌ చేస్తోంది టీమ్‌.ఇటు మన దగ్గర కూడా మంచి నెంబర్లనే టార్గెట్‌ చేస్తున్నారు మేకర్స్‌.

నైజామ్‌లో 75 కోట్ల దాకా బిజినెస్‌ జరుగుతుందన్నది టాక్‌. ఆల్రెడీ ఈ ఏరియాలో సలార్‌కు 70 కోట్లకు పైగా షేర్‌ రావడంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నారు మేకర్స్‌. అసలే ఫ్యూచరిస్టిక్‌ ఎలిమెంట్స్‌ తో, నెవర్‌ బిఫోర్‌ అన్నట్టు తెరకెక్కుతున్న కావడంతో రెట్టింపు నమ్మ కంతో ఫిగర్‌ని కోట్‌ చేస్తున్నారు ప్రొడ్యూసర్లు.

నైజామ్‌లోనే కాదు, మిగిలిన ఏరియాల్లోనూ రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది కల్కి మూవీ. మే 9న వైజయంతీ మూవీస్‌కి కలిసొచ్చిన డేట్‌లో విడుదల కానుంది కల్కి. అమితాబ్‌ బచ్చన్‌, దీపిక పదుకోన్‌, కమల్‌హాసన్‌, దిశా పాట్ని అంటూ సూపర్‌డూపర్‌ కాస్టింగ్‌తో, మంచి టెక్నికల్‌ టీమ్‌తో సిద్ధమవుతోంది కల్కి. రేంజ్‌ అలా ఉంది కాబట్టి, ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ మీద హైప్‌ భారీగా కనిపిస్తోంది.