విశాఖను రాజధానిని చేయడం పచ్చ పత్రికలకు ఎల్లో ఈమీడియాకి ఇష్టం లేదా? పచ్చ పత్రికల మాటున ఉన్న పచ్చ తమ్ముళ్లకు ఇది ఏమాత్రం గిట్టుబాటు కాని వ్యవహారమా? అంటే అవుననేది జగతికి తెలిసిన నిజం. అమరావతి రాజధాని పేరుతో వేల కోట్ల బినామీ పెట్టుబడుల్ని భూములపై పెట్టిన చంద్రబాబు &కో అనుయాయులు ప్రస్తుతం చేస్తున్న రచ్చ చూస్తుంటే .. ఈ రొంపిలో పలు పచ్చ చానెళ్ల బాబులు.. పచ్చ పత్రికల బాబులు కూడా ఉన్నారని అర్థమవుతోంది. ఆ 59 గ్రామాల రైతుల పేర్లతో దోపిడీ క్రతువుకు ప్లాన్ చేసి దానికి పచ్చ పత్రికల్లో ప్రమోషన్ చేసుకుని భూముల విలువ పెంచుకుని ఆస్తుల్ని పెంచుకోవాలన్న దారుణ ప్రణాళికకు తేదేపా నాయకుడు తెర తీస్తే .. దానికి వైకాపా నాయకుడు బిగ్ చెక్ పెట్టేశాడు.
Read More : పచ్చ మీడియాకి హైకోర్టు షాక్
అమరావతి రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు! అంటూ సీఎం జగన్ కొత్త కాన్సెప్ట్ తెరపైకి తేవడంతో ఒక్కసారిగా అమరావతిలో పెట్టుబడులు పెట్టిన పచ్చ బినామీలంతా ఖంగు తిన్నారు. ఇందులో పలు టీవీ చానెళ్ల ఓనర్లు ఉన్నారు. అమరావతి రాజధాని అని తెలిసిన క్షణం వీళ్లంతా హైదరాబాద్ నుంచి ఆఘమేఘాల మీద లగెత్తి మరీ అక్కడ భూముల్ని పరిశీలించారు. పలువురు రైతుల నుంచి తక్కువ ధరకు భూముల్ని బినామీ పేర్లతో కొనుక్కున్నారు. అందుకే ఇప్పుడు వైజాగ్ రాజధానిని వీరంతా వ్యతిరేకిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం.
Read More : టాలీవుడ్ వైజాగ్ వైపు చూస్తుందా?
అన్నట్టు విశాఖపట్నంపై గత కొద్దిరోజులుగా ఈనాడు.. ఆంధ్రజ్యోతి పత్రికలు సహా టీవీ 5.. ఏబీఎన్ లో వస్తున్న కథనాలు పరిశీలిస్తే కొన్ని విషయాలు స్పష్ఠంగా అర్థమవుతాయి. ఉన్నట్టుండి ఉత్తరాంధ్రా తీరం వెంబడి సముద్రంలో ఒక పెద్ద చీలిక వచ్చిందని.. అది హైదరాబాద్ కి చెందిన సైంటిస్టు చెప్పాడని ప్రచారం మొదలెట్టారు. వేల ఏళ్ల నాడు ఏర్పడిన చీలిక నేడో రేపో భూకంపంగా మారుతుందని ప్రకంపనాలు పుట్టించే వార్తల్ని ఈనాడు సహా పచ్చ మీడియాలు వండి వార్చాయి.
అక్కడితో అయిపోలేదు.. భూకంపానికి తోడు మొన్నటికి మొన్న ఎక్కడో బీరట్ (లెబనాన్) లో పేలిన చైనీ కంటైనర్ వార్తల్ని కూడా విష ప్రచారానికి వాడేసాయి పచ్చ మీడియాలు. భారీగా అమ్మోనియం నైట్రేట్ రసాయనాన్ని నిల్వ చేయడం వల్లనే ఈ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. మరునాడే దేశం మొత్తానికి సరఫరా చేసే అమ్మోనియం నైట్రేట్ ని వైజాగ్ లో నిల్వ ఉంచారని ఈనాడులో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూనే వేశారు. ఇదిగో ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్ చెప్పారు!! అంటూ ఇంటర్వ్యూ ఒకటి పెద్ద హెడ్డింగుతోనే వేశారు.
Read More : చైనాతో కొట్టుకునే దాకా వస్తే పచ్చ తమ్ముళ్లు సీన్లోకి!
ఇక నేడో రేపో వైజాగ్ నగరం సహా ఉత్తరాంధ్ర మొత్తం భూకంపంలో కూలిపోవడం లేదా రసాయన పేలుళ్లతో పేలిపోవడం ఖాయం. ఇక ఎందుకులే వైజాగ్ రాజధాని అన్నట్టుగా ఉందా ఇంటర్వ్యూ. పచ్చ పత్రికల పచ్చ నాటకాలకు దుష్ట పన్నగాలకు ఇది పరాకాష్ట అనే చెప్పాలి. అన్నట్టు వైజాగ్ ని రాజధాని చేస్తే ఉత్తరాంధ్రకు భూకంపం వచ్చేస్తున్నట్టేనా? లేక అమ్మోనియం నైట్రేట్ నిల్వ చేస్తే పేలిపోయి సర్వనాశనం అయిపోయినట్టేనా? ఇది తొందరగా తేల్చాల్సి ఉంది. ఒకవేళ పచ్చ పత్రికల హెచ్చరికల్ని నిజమేనని భావిస్తే అర్జెంటుగా అమ్మోనియం నైట్రేట్ ని అమరావతికి తరలించే పనిని జగన్ పెట్టుకుంటాడా? అన్నది కూడా చూడాలి. అన్నట్టు అమరావతి జిగట భూమిలో భారీ భవంతులు నిర్మిస్తే పది అడుగులు కూరుకుపోతాయని.. అలాగే చాలా చోట్ల భూకంపాలకు ఆస్కారం ఉందని.. దుర్గమ్మ గుడి కింద అగ్నిపర్వతం ఉందని కూడా ఇంతకుముందు ప్రచారమైంది. మరి దానిని తిరిగి సాక్షి జగన్ మీడియాలు తెరపైకి తెలేదు ఎందుకనో..!! రాజకీయ నాయకులు తలుచుకుంటే లేని భూకంపాలు పుట్టించగలరు.. రసాయన పేలుళ్లకు కుట్రలు కూడా చేయగలరన్నది అర్థం చేసుకోకపోతే అది ప్రజల తప్పిదమేనన్నమాట.
-శివాజీ.కె (సీనియర్ జర్నలిస్ట్.. కాలమిస్ట్)