షాకింగ్ రూమర్ : ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకి పోటీగా స్టార్ హీరోని పెట్టబోతున్న వైసీపీ?

ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో కన్నా ఒక్క ఏపీ మరియు తెలుగు సినిమాకి మధ్య లింక్ బాగా దగ్గర అయిపోతుంది అని చెప్పాలి. రాజకీయాల్లో సినిమా వాళ్ళు ఉంటున్నారో అనో ఏమో కానీ చాలా రసవత్తరంగా అంతా మారుతుంది. అయితే ఇప్పుడు ఏపీలో మూడు ప్రధాన పార్టీలు ఉండగా వాటిలో అధికంగా అయితే ఇప్పుడు ఉన్న అధికార వైసీపీ అలాగే ప్రతిపక్షము టీడీపీ లు హోరా హోరీగా ఉన్నాయి. 

అలాగే స్టార్ హీరో పవన్ పార్టీ జనసేన కూడా బాగానే పుంజుకుంటుంది కానీ అధికార వైసీపీ మాత్రం రెండు పార్టీలను తేలిగ్గా తీసుకోలేదు. తాజాగా అయితే సినిమా వర్గాల్లో షాకింగ్ రూమర్ ఒకటి వచ్చే ఎన్నికల విషయంలో వైరల్ అవుతుంది. టీడీపీ కి అలాగే ఆ పార్టీ అధినేత చంద్రబాబుకి పోటీగా ఓ ఊహించని వ్యక్తిని వైసీపీ తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. 

ఆ హీరో మరెవరో కాదట కోలీవుడ్ మరియు మన తెలుగు వాడైన హీరో విశాల్ అట. ఈ హీరోని వైసీపీ తరపున కుప్పంలో చంద్రబాబు పై పోటీగా నిలుపుతున్నట్టు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఎంతవరకు నిజం అవుతుందో తెలియాల్సి ఉంది. అలాగే విశాల్ కూడా దీనిపై ఏమన్నా స్పందిస్తాడో లేదో తెలియాలి. ఒకవేళ నిజంగా పోటీ అయితే ఆ పరిస్థితి చూడాల్సిందే.