`విశ్వ‌రూపం 2` ర‌న్ టైమ్‌

                                                                           (ధ్యాన్)

యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ‘విశ్వరూపం’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘విశ్వరూపం 2’. ఆగస్ట్‌ 10న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఆస్కార్‌ ఫిలిం (ప్రై) లిమిటెడ్‌ వి.రవిచంద్రన్‌ సమర్పణలో రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మించిన ఈ భారీ చిత్రంపై ప్రేక్షకుల్లో చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో, ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌లో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో నిర్మించిన ఈ చిత్రం ర‌న్ టైమ్ ఫిక్స్ అయింది. సినిమా వ్య‌వ‌ధి 2 గంట‌ల 21 నిమిషాలు ఉంటుంద‌ట‌. హిందీలో ఈ చిత్రాన్ని రోహిత్ శెట్టి, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు విడుద‌ల చేస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆర్ధిక వ్య‌వ‌హ‌రాల్లో వ‌చ్చిన కేసుకు సంబంధించిన వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా మ‌ద్రాస్ హైకోర్టు రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ పిలింస్‌ను ఆదేశించింది. ఇప్పుడేమ‌వుతుందో చూడాలి…