ఉత్కంఠత కలిగించే “వైకుంఠ‌పాళి”

ఉత్కంఠత కలిగించే “వైకుంఠ‌పాళి”

“వైకుంఠ‌పాళి” టైటిల్, ట్రైల‌ర్ ఇలా ప్ర‌తిది కొత్త‌గా ఉంది. ప్రేక్షకులు కొత్త కాన్సెప్ట్స్ ఆద‌రిస్తోన్న ఈ త‌రుణంలో ఇలాంటి సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు నిర్మాత కె .ఎస్. రామా రావు . “వైకుంఠ‌పాళి” చిత్ర ఆడియో శనివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా వచ్చిన కె.య‌స్‌.రామారావు ఆడియో ను ఆవిష్కరించారు .
ద‌ర్శ‌కుడు వీర‌శంక‌ర్ మాట్లాడుతూ…“టైటిల్ చాలా క్యాచీగా ఉంది. ఇంత వ‌ర‌కు తెర‌పై రాని హార‌ర్ గేమ్ అంటున్నారు. సినిమా స‌క్సెస్ సాధించాల‌నీ, ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు రావాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు.

మరో ద‌ర్శ‌కుడు వి.స‌ముద్ర మాట్లాడుతూ…“వైకుంఠ‌పాళి` అంద‌రికీ బాగా తెలిసిన ఆట‌. అలాంటి గేమ్ తో ఒక హారర్ సినిమా చేయాల‌నుకోవ‌డం అనేది అద్భుత‌మైన ఆలోచ‌న‌. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోన్న ఈ స‌మ‌యంలో ఇలాంటి ప్ర‌య‌త్నం చేసిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నా శుభాకాంక్ష‌లు“ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు అజ్గ‌ర్ అలీ మాట్లాడుతూ…“ఈ సినిమా షూటింగ్ పూర్తి అయి రిలీజ్ వ‌ర‌కు వ‌చ్చిందంటే ప్ర‌ధాన కార‌ణం మా నిర్మాత కాండ్రేగుల ఆదినారాయ‌ణ‌గారు. కొత్త వార‌మైనా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా మాకు పూర్తి స్వేచ్ఛ‌నిచ్చి సినిమా బాగా రావడానికి స‌హ‌క‌రించారు. ఇలాంటి నిర్మాత‌లు ఉంటే సినిమా విడుద‌ల కోసం క‌ష్టాప‌డాల్సిన ప‌నేలేదు. ఇక వైకుంఠ‌పాలి ఓ కొత్త పాయింట్ తో తీసాం. అంద‌రికీ క‌నెక్టవుతుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాం“ అన్నారు.

చిత్ర నిర్మాత కాండ్రేగుల ఆదినారాయ‌ణ మాట్లాడుతూ…“ఇంత వ‌ర‌కు రాని హార‌ర్ గేమ్ చిత్రం `వైకుంఠ‌పాళి`. సాయి కేత‌న్ ఇందులో అండ‌ర్ క‌వ‌ర్ కాప్ గా న‌టించాడు. ఈ నెల 23న సినిమాను విడుద‌ల చేస్తున్నాం అని చెప్పారు .