Gopichand: గోపీచంద్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బర్త్డే సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ రిలీజ్!

Gopichand: టాలీవుడ్ హీరో గోపీచంద్ గురించి మనందరికీ తెలిసిందే. గోపీచంద్ ప్రస్తుతం సినిమా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే ఇటీవల కాలంలో గోపీచంద్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న విషయం తెలిసిందే. సిటీ మార్ సినిమా తరువాత గోపీచంద్ నటించిన సినిమాలు వరుసగా ఐదు ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ గోపీచంద్ క్రేజీ ఏమాత్రం తగ్గడం లేదు. కానీ అభిమానులు మాత్రం గోపీచంద్ సినిమాల విషయంలో చాలా నిరాశ వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి.

ప్రతి సినిమాకు అభిమానులకు నిరాశ ఎదురవుతూనే ఉంది. ఇది ఇలా ఉంటే గోపీచంద్ ప్రస్తుతం దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. #Gopichand33 వ‌ర్కింట్ టైటిల్‌ తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఇది ఇలా ఉంటే నేడు గోపిచంద్ పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర బృందం స్పెష‌ల్ గ్లింప్స్‌ ను విడుద‌ల చేసింది. అత‌డో యోధుడు విప్ల‌వాన్ని ర‌గిలించ‌డానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ వీడియోను పంచుకుంది. భారీ బ‌డ్జెట్‌ తో ఈ చిత్రం తెర‌కెక్క‌నున్న‌ట్లు తెలుస్తోంది. శ్రీనివాస సిల్వ‌ర్ స్క్రీన్ పై చిట్టూరి శ్రీనివాస ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

#Gopichand33 Birthday Glimpse | Gopichand | Sankalp | Chitturi Srinivasaa | Srinivasaa Silver Screen

త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు మూవీ మేకర్స్.. అయితే ఇప్పుడు గోపీచంద్ అభిమానులు అలాగే హీరో గోపీచంద్ ఆశలన్నీ కూడా ఈ సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమా హిట్ అవ్వాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే గోపీచంద్ కెరీర్ డేంజర్ జోన్ లో పడ్డట్టే అని చెప్పాలి. దర్శకుడు సంక‌ల్ప్ రెడ్డి గ‌తంలో ఘాజీ, అంత‌రిక్షం వంటి సినిమాల‌ను తెర‌కెక్కించిన విషయం తెలిసిందే. కొంత గ్యాప్ త‌రువాత ఆయ‌న నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో భారీగా అంచనాలు నెల కొన్నాయి.