నందమూరి బాలకృష్ణకి ఊహించని షాక్

నందమూరి తారక రామారావు తనయుడు, టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణకి సంబంధించిన ఒక వార్త నెట్లో హల్ చల్ చేస్తోంది. బాలకృష్ణ అభిమానులను ఎవరినైనా బాలకృష్ణ వయసు ఎంత అని అడిగితే తడుముకోకుండా ఠక్కున 58 ఏళ్ళు అని చెబుతారు. అదే మాములు వారిని అడిగితే 60 అటో ఇటో ఉండొచ్చు అని చూచాయగా చెబుతారు. ఇంకా హీరో పాత్రలే వేస్తున్నారు కాబట్టి బాలయ్య వయసు 50కి ఒకటి అటు లేదా ఒకటి ఇటు అనికూడా అనుకుంటారు.
కానీ నేడు ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్ దిగ్గజం, అతి పెద్ద సెర్చ్ ఇంజన్ సంస్థ అయిన గూగుల్ బాలకృష్ణ వయసు విషయంలో పెద్ద పొరపాటు చేసింది.

ఆయన వయసును దాదాపు డబుల్ చేసింది. బాలకృష్ణ వయసు “104 ” ఏళ్ళు అని తేల్చి చేసింది గూగుల్ మాత. ఆయన 1960 జూన్ 10 న జన్మించారు. కానీ గూగుల్ తల్లి మాత్రం బాలకృష్ణ 1913 నవంబర్ 2 న జన్మించినట్టు, ఆయన వయసు ఇప్పుడు 104 ఏళ్లుగా చూపిస్తోంది. ఆయన వయసు ఇప్పుడు 58 ఏళ్ళు. కానీ గూగుల్ లో మాత్రం తప్పుగా అప్లోడ్ అయ్యింది. ఇది చూసిన వారంతా నోరెళ్లబెడుతున్నారు. ఇక బాలయ్య అభిమానులైతే తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. గూగుల్ సంస్థపై మండి పడుతున్నారు.ఇప్పటికీ ఎనర్జటిక్ గా కనిపించే మా బాలయ్య బాబు వయసు 104 అన్నట్టు చూపిస్తుందా అంటూ తిడుతున్నారు.

ఇక గూగుల్ బాలయ్య సమకాలీకులు, ఆయన తరానికి చెందిన మిగిలిన హీరోల విషయంలో కూడా ఇలానే చేసిందా అంటే అలా ఏం లేదు. హీరో వెంకటేష్ వయసు 57 సంవత్సరాలు. అక్కినేని నాగార్జున వయసు 59 . మెగాస్టార్ చిరంజీవి వయసు 63 ఏళ్ళు. వీరి వయసులు మాత్రం కరెక్ట్ గానే చూపిస్తోంది. ఒక్క బాలకృష్ణ వయసులోనే పొరపాటు చేసింది. దీనికి సంబంధించిన ఫోటో కింద ఉంది చూడండి.

ప్రస్తుతం బాలయ్య తన తండ్రి జీవిత కదా ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకి ఆయనే స్వయంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో తెలుగు ప్రముఖ నటులతో పాటు బాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు. విద్య బాలన్ బసవతారకం పాత్ర పోషిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ శ్రీదేవిలా కనపడనున్నారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనవడు సుమంత్ యాక్ట్ చేస్తున్నారు. జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆ సినిమా కోసం బాలయ్య ఫాన్స్ ఆశగా ఎదురు చూస్తున్న వేళ గూగుల్ చేసిన నిర్వాకం వారిని ఆగ్రహానికి గురి చేస్తున్నది. ఈ విషయంలో గూగుల్ బాలయ్యకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పరువు నష్టం దావా వేస్తామంటున్నారు.

గతంలో బాలయ్య మీద సోషల్ మీడియాలో కుళ్లు జోక్స్ సర్కులేట్ అయ్యేవి. అప్పుడు బాలయ్య సీరియస్ గా తీసుకుని పోలీస్ కేస్ పెట్టారు. అప్పుడు పోలీసులు ఆ జోక్స్ ప్రచారం చేసే మనిషిని అరెస్ట్ చేశారు కూడా. తాజాగా గూగుల్ బాలయ్య ఏజ్ విషయంలో వివాదం రాజేసింది.

గూగుల్ లో బాలయ్య ఏజ్ ఎంత అనే విషయం తెలియాలంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి nandamuri balakrishna age అని టైప్ చేసి చూడొచ్చు. దీనికి సంబంధించిన ఫోటో కింద ఉంది చూడవచ్చు .