ఆసక్తి కలిగిస్తున్న “ది యాక్షిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ “

ఇప్పుడు బయోపిక్ ల కాలం నడుస్తుందా అనిపిస్తుంది. అన్ని భాషల్లో ప్రముఖుల బయోపిక్ లపై నటీనటులు ఆసక్తి చూపిస్తున్నారు. హిందీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితంపై నిర్మిస్తున్న “ది యాక్షిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ” చిత్రంపై ఇప్పుడు అందరి దృష్టి వుంది.

హిందీ నటుడు అనుపమ్ ఖేర్  మన్మోహన్ సింగ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సునీల్ బోహ్రా , ధవళ్ గాఢ  విజయరత్నాకర్  దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ట్రైలర్ గురువారం నాడు విడుదలవుతుందని అనుపమ్ ఖేర్ తన సంతోషాన్ని  ట్విట్టర్లో పంచుకున్నాడు. ఇంతకాలం మీరందరూ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు, ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది, రేపే “ది యాక్షిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ”  చిత్రం ట్రైలర్  విడుదలవుతుంది అని తెలిపాడు.

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ సినిమా ఎన్నికల ముందు మార్చిలో విడుదలవుతుంది.