శ్రీరెడ్డి శ్రీలీక్స్ మొదలుపెట్టి తరచూ సెలెబ్రిటీలను రచ్చకీడుస్తున్న విషయం తెలిసిందే.. తన లీక్స్ ఇప్పట్లో ఆగేలా లేవు. ఇప్పుడు తమిళ లీక్స్ పేరిట ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఫేమస్ కెమెరామెన్ గురించి పోస్టు పెట్టి మళ్ళీ రచ్చ చేసింది.
అరణ్మనై సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్న సమయంలో ఆ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాకు కాల్ చేసాడు. నేను షూటింగ్ స్పాట్ కి వెళ్లిన తర్వాత అతను నాకు డైరెక్టర్ సుందర్ సి సార్ ని పరిచయం చేశాడు. అలాగే అక్కడ నేను నా ఫేస్బుక్ ఫ్రెండ్ అయిన కెమెరామెన్ సెంథిల్ కుమార్ ని కూడా కలిశాను. ఆరోజు అతను నువ్వు తన నెక్స్ట్ ప్రాజెక్టులో ఖచ్చితంగా ఉంటావు అని కన్విన్స్ చేశాడు. తర్వాతి రోజు నోవాటెల్ హోటల్ కి రమ్మని పిలిచారు. తన నెక్స్ట్ మూవీలో ఉండాలంటే నన్ను కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పాడు. తరువాత ఏమైందో పెరుమాళ్ళకే తెలియాలి. ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఒక ఫ్రాడ్ అని పోస్ట్ పెట్టింది.