సామ్ నెక్ట్స్ లేడీ బాస్?
అక్కినేని కోడలు అంతకంతకు గ్రాఫ్ పెంచుకుంటోందా? అంటే అవుననే తాజా సీన్ చెబుతోంది. మహిళా ప్రధాన చిత్రాలతో స్టార్ డమ్ ని విస్తరించేందుకు సమంత చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నాయనే తాజా సన్నివేశం చెబుతోంది. గత ఏడాది సమంత ప్రధాన పాత్రలో నటించిన `యూటర్న్` క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నా బాక్సాఫీస్ వద్ద ఆశించిన వసూళ్లను తేలేకపోయింది. అయినా నటిగా సమంతపై ప్రశంసలు కురిసాయి. 2019లో రిలీజైన మజిలీ, ఓ బేబి చిత్రాలు ఘనవిజయాలు అందుకున్నాయి. మజిలీ విజయంలో సామ్ కే క్రెడిట్ ఎక్కువ దక్కింది. అలాగే సోలో నాయికగా నటించిన ఓబేబి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఒక మిడ్ రేంజ్ హీరోకి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా వసూళ్లను సాధించింది.
ఓ బేబి
ఫుల్ రన్ వసూళ్లు చూస్తే దాదాపు 13 కోట్ల మేర షేర్ వసూళ్లను దక్కించుకుంది. ఒక నాయికా ప్రధాన చిత్రానికి ఈ స్థాయి వసూళ్లు దక్కడం అన్నది గొప్పతనమేనని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ హవా సాగుతోంది. ఈ ఒరవడిలో సమంత మరో విజయశాంతి తరహాలో సక్సెస్ అందుకోనుందనే అభిమానులు అంచనా వేస్తున్నారు. వరుసగా నాయికా ప్రధాన స్క్రిప్టుల్ని ఎంచుకుంటూ సమంత తన మార్కెట్ రేంజును విస్తరిస్తోంది. ఇటు తెలుగు- అటు తమిళ్ రెండు చోట్లా తనకు ప్రత్యేకించి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండడం మార్కెట్ పరంగా కలిసొచ్చేదేనని విశ్లేషిస్తున్నారు. ఓ బేబి నైజాంలో 4.97 కోట్ల మేర షేర్ వసూలు చేసింది. అలాగే ఆంధ్రాలోనూ 8 కోట్ల మేర వసూళ్లను సాధించింది. మునుముందు అనుష్క.. నయనతార రేంజ్ ను అందుకోవాలంటే సామ్ మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుట్టాల్సి ఉంటుందేమో!?