సమంత ఇప్పుడు తన సాకీ డిజైన్స్ మీద దృష్టి పెట్టేసింది. మామూలుగా సమంత షేర్ చేసే పది పోస్ట్‌లో దాదాపు 5, 6 సాకీ గురించి, దాంట్లో కొత్తగా వచ్చిన కలెక్షన్స్ గురించే ఉంటున్నాయి. అయితే సాకీలో వస్తోన్న కొత్త డిజైన్స్‌ను ముందు సమంతే ట్రై చేసి తన ఫాలోవర్లకు చూపిస్తోంది. ఎంత అందంగా ఉంది.. ఎంత కంఫర్ట్‌గా ఉందో చెబుతోంది. మొత్తానికి సమంత తన సాకీని బాగానే ప్రమోట్ చేసుకుంటోంది.
మామూలుగా అయితే చలి కాలంలో ధరించే వస్త్రాలు వేరుగా ఉంటాయి.. ఎండాకాలంలో వేసుకునే దుస్తులు వేరుగా ఉంటాయి. ఇలా కాలాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి రకరకాల దుస్తులను ధరిస్తుంటారు. తాజాగా ఇదే విషయంపై సమంత ఓ పోస్ట్ చేసింది. తాపీగా సోఫాలో నవ్వులు చిందిస్తూ అలా ఆరామైంది సమంత. అలా కూల్ ఫోటోను షేర్ చేస్తూ కూల్ విషయాన్ని చెప్పేసింది. సమ్మర్ స్పెషల్ డ్రెస్‌లు వచ్చేస్తున్నాయని చెప్పేసింది.
నేను ఆల్రెడీ సమ్మర్, సన్నీ డేస్ కోసం సిద్దంగానే ఉన్నానంటూ సమంత చెప్పుకొచ్చింది. మొత్తానికి సమంత తాజాగా షేర్ చేసిన ఫోటోలో ఎంతో నిండుగా ఉంది. చిరునవ్వులు చిందిస్తున్న సమంతను చూసి అందరూ ఫిదా అవుతున్నారు. సమంత ప్రస్తుతం కాథువాక్కుల రెండు కాదల్, శాకుంతలమ్ అనే రెండు చిత్రాలతో బిజీగా ఉంది. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా కాథువాక్కుల రెండు కాదల్ నుంచి మొదటి పాట రాబోతోందని సమంత తెలిపింది.