హీరోయిన్ పాత్రలపై సందేహాలు ఉండేవి – సాయి పల్లవి

హీరోయిన్ పాత్రలపై సందేహాలు ఉండేవి – సాయి పల్లవి

సాయి పల్లవి తాజాగా రానా తో కలిసి ‘విరాట పర్వం’లో నటిస్తోంది. ఈ చిత్రంతో పాటు, తమిళ చిత్రాల్లోనూ నటిస్తోంది. అయితే ‘విరాట పర్వం’ తనకు కెరీర్ లో చెప్పుకోతగ్గ మరో గొప్ప క్యారక్టర్ అవుతుందని అంటోందిట. అవునా.. అంత గొప్ప క్యారక్టర్ ని చేస్తున్నావా? ఆ పాత్ర తాలూకు విశేషాలేంటో ? అని ఆడిగితే మాత్రం సినిమా చూశాక మీకే తెలుస్తుంది అని చెబుతుందట.

మళ్లీ తనే మాట్లాడుతూ… ”సమాజంలో మహిళలు ఎంత బలంగా కనిపిస్తారో … తెరపైన కథానాయిక కూడా ఆలా కనిపించాలి కదా” అంటోంది. ముందు నుంచీ ప్రాధాన్యమున్న పాత్రల్లో మెరుస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న కథానాయిక సాయి పల్లవి. కథలో కానీ, పాత్రలో కానీ సహజత్వమే నన్ను ఎక్కువగా ఆకర్షిస్తుంటుందని చెబుతోంది. పాత్రల ఎంపికలో కచ్చితత్వం ప్రదర్శిస్తుంటారు కదా, ఆ విషయంలో స్ఫూర్తి ఎవరని అడిగితే.. ”నేనేం చేయగలనో, ఏం చేస్తే నాకు సౌకర్యంగా ఉంటుందో నాకు ఓ స్పష్టత ఏర్పడిన తర్వాతే పరిశ్రమలోకి వచ్చా. నా ప్రయాణాన్ని మరింత సులభతరం చేసిన విషయం అదే.

పరిశ్రమలోకి రాకముందే మన సినిమాల్లో నాయిక పాత్రలపై కొన్ని సందేహాలు ఉండేవి. కొన్ని పాత్రల్ని చూసినప్పుడు బయట మహిళలెవరూ ఇలా ఉండరు కదా,మరి ఇక్కడ ఇలా చూపిస్తున్నారెందుకు? అనిపించేది. నేను కథానాయికని అయ్యాక అందుకు భిన్నంగా తెరపై కనిపించాలని నిర్ణయం తీసుకొన్నా. అదే ఆలోచనలతోనే ప్రయాణం చేస్తున్నా. ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తున్నాననడం కంటే, సగటు అమ్మాయి జీవితాల్ని ప్రతిబింబించే పాత్రలు చేస్తున్నా. అని చెప్పడం బాగుంటుంది. తాజాగా రానాతో ‘విరాట పర్వం’లో చేస్తున్న పాత్ర అలాంటిదే. సగటు మహిళల గౌరవాన్ని పెంచే క్యారెక్టర్ ఇది” అంటూ చెప్పుకొచ్చింది!!