రాజమౌళి ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఎన్టీఆర్, రాజమౌళి ప్రధాన పాత్రలలో ఈ చిత్రం రూపొందుతుండగా, ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ పూణేలో ప్లాన్ చేశారు. అక్కడ షూటింగ్‌కి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నప్పుడల్లా ఏదో ఒక ఆటంకం ఏర్పడుతుందట. ఈ క్రమంలో రాజమౌళి పూణేలో జరపాల్సిన షెడ్యూల్‌ని తమిళనాడుకి షిఫ్ట్ చేశాడట. ఇప్పటికే అక్కడ పలు లొకేషన్స్ ఓకే చేశాడని, దాదాపు 35 రోజుల పాటు అక్కడ షూటింగ్ జరిపేందుకు సన్నాహాలు కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది. చరణ్ – ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలని ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తారట . సముద్రఖని, అజయ్ దేవగణ్ వంటి ప్రముఖులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవుతున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.