నయనతార అయితే కష్టం బాసూ.!

‘జవాన్’ సినిమాతో నయనతార రేంజ్ మళ్ళీ పెరిగింది.! పెరగడమేంటి.. అనూహ్యమైన స్థాయికి చేరుకుందిప్పుడు నయనతార స్టార్‌డమ్. అదే నయనతార ప్రత్యేకత. నయనతారతోపాటు స్టార్ హీరోయిన్లుగా అప్పట్లో వున్నవాళ్ళలో చాలామంది, ఇప్పుడు సినిమాల్లో కనిపించడంలేదు.

ఇదిలా వుంటే, సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా, నయనతారకి రెమ్యునరేషన్ పలుకుతోంది. ‘గాడ్ ఫాదర్’ సినిమా కోసం తెలుగులో ఆమెకి షాకింగ్ రెమ్యునరేషన్ ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశమయ్యింది.

తెలుగు సినిమా ప్రమోషన్లకు నయనతార రాదు. కానీ, నయనతారకి వున్న క్రేజ్ వేరే లెవల్.! ‘గాడ్ ఫాదర్’ తర్వాత మరే తెలుగు సినిమాకీ నయనతార కమిట్ కాలేదు. తాజాగా, ఓ సెన్సేషనల్ ప్రపోజల్ నయనతార ముందుకు వెళ్ళిందట టాలీవుడ్ నుంచి.

ఓ సీనియర్ హీరో నటించే ప్రెస్టీజియస్ మూవీ కోసం నయనతారని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లతో సమానంగా, అంతకన్నా ఎక్కువగానే నయనతార రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

దాంతో, ఆ ప్రొడక్షన్ హౌస్ పునరాలోచనలో పడిందని అంటున్నారు. ఆ హీరో మాత్రం, నయనతారే కావాలని పట్టుబడుతున్నాడట.