‘అమ‌ర్ అక్బ‌ర్ అంటోని’టీజ‌ర్ వచ్చేసింది, ఎలా ఉందంటే

గత కొంతకాలంగా వరస ఫ్లాఫ్ లు ఎదుర్కొంటున్న మాస్ రాజా ర‌వితేజ రీసెంట్ గా వచ్చిన రాజా ది గ్రేట్ హిట్ తో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపధ్యంలో ఆయన తన తాజా ప్రాజెక్టుల పట్ల ఆచి తూచి వ్యవరిస్తూ ఓకే చేసిన సినిమా అమ‌ర్ అక్బ‌ర్ అంటోని. తనకంటూ తెలుగు ప్రేక్షకుల్లో ఓ స్దానం ఏర్పాటు చేసుకున్న శ్రీనువైట్ల దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే చాలా అంచనాలే ఉన్నాయి. అయితే శ్రీనువైట్లది సేమ్ టు సేమ్ రవితేజ పరిస్దితే. ఎలాగైనా హిట్ కొట్టాల్సిన సిట్యువేషన్.

రవితేజ హీరోగా మూడు విభిన్న పాత్రలతో తెర‌కెక్కుతుంది అమర్ అక్బర్ అంథోని.టీజర్ ఈరోజే రిలీజ్ అయింది. టీజర్ చూస్తూంటే పగ..ప్రతీకారాల చుట్టూ కథ తిరుగుతోందని అర్దమవుతోంది. మైత్రీ వారు నిర్మాతలు కాబట్టి ప్రతి షాట్ రిచ్ గా కనిపించింది. శ్రీను వైట్ల చాలా డిఫరెంట్ రివేంజ్ స్టోరీగా దీన్ని తీర్చి తిద్దుతున్నాడని అర్దమవుతోంది. అయితే ఈ టీజర్ ద్వారా ఎక్కడా కథకు సంభందించిన క్లూ మాత్రం ఇవ్వలేదు.

 

అదేసమయంలో టీజ‌ర్‌ను ఆక‌ట్టుకునే విధాంగా తెర‌కెక్కించారు అన‌డంలో సందేహం లేదు.మరి ఈ సినిమా రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్ కు ఏ స్దాయి విజయాన్ని ఇస్తుందో చూడాలి. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో ఇలియానా సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ .