హీరోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోయిన్

“గీత గోవిందం” సినిమాతో ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత “మహానటి” సినిమాలో కనిపించాడు విజయ్. ప్రస్తుతం విజయ్ “నోటా, డియర్ కామ్రేడ్” సినిమాలలో నటిస్తున్నాడు. తాజాగా దర్శకుడు క్రాంతి మాధవ్ సినిమాకు విజయ్ సైన్ చేసినట్టు తెలుస్తోంది.

క్రాంతి మాధవ్ ఓనమాలు, మళ్ళి మళ్ళి ఇది రాని రోజు, ఉంగరాల రాంబాబు వంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్, క్రాంతి మాధవ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించటానికి రాశీఖన్నాని సంప్రదించారట బృందం.

విజయ్ సరసన హీరోయిన్ గా నటించటానికి రాశీ ఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తొలిప్రేమ సినిమాతో సక్సెస్ బాట పట్టింది రాశీ ఖన్నా. టాప్ హీరోల సరసన నటిస్తున్న రాశిఖన్నా విజయ్ కి జోడీ కట్టడానికి సై అనటం ఆసక్తిగా మారింది. విజయ్ క్రేజీ హీరో అయినప్పటికీ టాప్ హీరోల సినిమాలో నటిస్తున్న రాశిఖన్నా విజయ్ కి ఓకే చెప్పటం విశేషం అంటున్నాయి సినీ వర్గాలు.