నాగబాబు,బాలయ్య ‘వార్’ మధ్యలోకి వర్మ

మెగాస్టార్ కుటుంబంపై గతంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా నాగబాబు ఇప్పుడు వరసపెట్టి వీడియోలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగబాబు వీడియోలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్స్ తో వ్యంగ్య బాణాలు వేసారు.

వర్మ స్పందిస్తూ.. ‘కామెంట్లు చేయ‌డంలో న‌న్ను మించిపోయార‌నే నా బాధ ఒక‌వైపు.. త‌న స్టార్ బ్ర‌ద‌ర్స్‌ను స‌మ‌ర్థించ‌డంలో సూప‌ర్‌స్టార్ అయిపోయార‌న్న ఆనందం మరోవైపు.. ఒక కంట క‌న్నీరు, మ‌రో కంట ప‌న్నీరు. నాగ‌బాబు గారూ హ్యాట్సాఫ్‌.. మీ సోద‌రుల‌ను మీరు ఎంత‌గా ప్రేమిస్తున్నారో మేం కూడా అంతే ప్రేమిస్తున్నాం` అని ట్వీట్ చేశారు.

మరో ప్రక్క నాగబాబు ఇలా సోషల్ మీడియాలో రచ్చ చెయ్యడం ఎవ్వరికి నచ్చడం లేదు. ఒక నటుడిగా ఒక నిర్మాతగా అంత పేరు సంపాదించుకోలేకపోయిన నాగబాబు…బుల్లితెరపైన ప్రసారమౌతున్న జబర్దస్త్ షో వలన ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకొని మంచి మైలేజ్ ని దక్కించుకుంటున్నాడు. అలాగే నాగబాబు అంటే అందరికీ సదభిప్రాయం ఉంది. దాంతో నాగబాబు ఇలా ప్రవర్తించడం అభిమానులకే నచ్చడం లేదు. మరో ప్రక్క బాలయ్య ఫాన్స్ నాగబాబు పై కామెంట్స్ మొదలెట్టారు.