ఈ ఫొటో చూసి..వావ్ ‘చెర్రీ’ అనని వాళ్లు లేరు

ఇప్పుడు రామ్ చరణ్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటా ఫొటో స్పెషాలిటీ అంటే… ఫిట్నెస్ గా ఉన్న రామ్ చరణ్ . బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న వినయ విధేయ రామ కోసం బాడీని బిల్డప్‌చేసిన రామ్‌ చరణ్‌.. ట్రైలర్‌లో తన విశ్వరూపాన్ని చూపాడంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా రామ్ చరణ్ బాడీని హైలెట్‌ చేస్తూ.. పచ్చబొట్టుతో ఉన్న సీన్స్ హైలెట్‌గా నిలిచాయి.

అయితే ఇలా రామ్ చరణ్ బాడీని బిల్డప్‌ చేసుకోవడానికి చేయాల్సిన పనులు, పాటించాల్సిన సూచనలు తెలుపుతూ.. బీపాజిటివ్‌ మ్యాగజైన్‌ కవర్‌పై వేసిన చెర్రీ పిక్‌ హైలెట్‌ అవుతోంది. అంతేకాదు… నా దేహం-నా దేవాలయం అంటూ రామ్‌ చరణ్‌ కొటేషన్‌ కూడా వైరల్‌ అవుతోంది.

అలాగే మనకు కండలు వీరుడు..ఫిట్నెస్ గా ఉండే హీరో అంటే సల్మాన్‌ ఖాన్‌ గుర్తు వస్తారు. ఆ తరువాతే ఎవరైనా. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఈ బాడీ ఫిట్‌నెస్‌పై ప్రతీ హీరో దృష్టిసారిస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగులో అల్లు అర్జున్‌, ప్రభాస్‌, రానా, రామ్‌ చరణ్‌లాంటి స్టార్లు ఫిట్‌గా కనిపించటం మనం గమనించవచ్చు.