Pushpa in OTT: కరోనా మహమ్మారి వలన తీవ్రంగా నష్టమైన రంగాలలో సినీ రంగం ఒకటి. లాక్ డౌన్ వలన సినిమా థియేటర్లు అన్ని మూతపడడం వలన సినీ పరిశ్రమ చాలా తీవ్రంగా నష్టపోయింది. అయితే ఇలాంటి సమయం లోనే ఓటిటి డిజిటల్ రంగం దూసుకొచ్చింది. కరోనా కారణంగా ఓటిటి ప్లాట్ఫారమ్స్ కి మంచి డిమాండ్ పెరగడం వలన చిన్న సినిమా నుండి పెద్ద సినిమా వరకూ ఇందులోనే విడుదల అవుతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు “పుష్ప : ది రైజ్ – పార్ట్ 1” కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూసారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందించిన పుష్ప : ది రైజ్ – పార్ట్ 1 డిసెంబర్ 17న విడుదల అయ్యింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఈ చిత్రం ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాగా, తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చారు.
సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. ఆర్య 2 తర్వాత సుక్కు – బన్నీ కాంబోలో వచ్చిన పుష్ప చిత్రం బాక్స్ఆఫీసు ముందు మంచి వసూళ్లను రాబడుతుంది. విభిన్నమైన కథ తో ఈ సినిమా రూపొందగా గంధపు చెక్కల నేపథ్యంలో ఉంది. అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని విభిన్న పాత్రలో కనిపించాడు. అయితే ఈ కాలంలో సినిమాలన్నీ నాలుగు వారాల తరువాత ఓటీటీ లో ప్రత్యక్షమవుతున్నాయి.
ఈ నేపథ్యం లో పుష్ప కూడా ఓటీటీ లలోకి ఎప్పుడు వస్తుంది అనే చర్చ ఇప్పుడు మొదలయ్యింది. భారీ అంచనాలతో తెరకెక్కించిన ఈ సినిమా ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాని 40- 50 రోజుల తర్వాత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమాచారం. సంక్రాంతి బరిలో కొత్త సినిమా రావడం వలన కల్లెక్షన్స్ వీక్ అవుతాయి కాబట్టి పుష్ప సినిమాని సంక్రాంతి టైం లో ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేస్తారని సమాచారం.