Papa OTT: ఇటీవల కాలంలో ఓటీటీలోకి వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ లు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఓటీటీలో విడుదల అయిన సినిమాలు అన్ని కూడా సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. ఇకపోతే ఇటీవల కాలంలో సినిమాలు ఒక ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూనే మరో ఓటీటీ లోకి కూడా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అలా ఇప్పుడు ఒక డబ్బింగ్ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది.
పెళ్లికి ముందే తొందరపడి పేరెంట్స్ అయిన ఒక జంట.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే పాయింట్ తో ఎమోషనల్ గా తీసిన ఈ మూవీ ఇది. కాగా 2023లో తమిళంలో డాడా టైటిల్ తో ఒక సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయింది. కవిన్, అపర్ణా దాస్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఈ ఏడాది జూన్ లో పాపా అనే పేరుతో థియేటర్లలో రిలీజ్ చేశారు. కాకపోతే డబ్బింగ్ బొమ్మ కావడం వల్ల ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇది జరిగిన కొన్నాళ్లకు అంటే జూలై చివరలో ఆహా ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. తర్వాత మంచి రెస్పాన్స్ అందుకుంది.
ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి హడావుడి లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇకపోతే పాపా సినిమా విషయానికొస్తే.. మణికంఠ (కవిన్), సింధు (అపర్ణ) ఇద్దరు క్లాస్‌మేట్స్. వీరి మధ్య మొదలైన స్నేహం కొద్ది రోజులకు ప్రేమగా మారుతుంది. అయితే కాస్త తొందరపడేసరికి పెళ్లికి ముందే సింధు గర్భం దాల్చుతుంది. ఆ విషయం తెలిసిన కుటుంబ పెద్దలు వీళ్లని దూరం పెడతారు. దీంతో మణి-సింధు ఒక అద్దె ఇంట్లో ఉంటూ చదువు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రయాణంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? జన్మనిచ్చిన వెంటనే బిడ్డను వదిలేసి సింధు ఎందుకు వెళ్లిపోయింది? ఆ చిన్నారిని పెంచేందుకు మణి ఎంతగా కష్టపడ్డాడు? మణి జీవితంలోకి మళ్లీ సింధు వచ్చిందా? చివరికి ఏమి జరిగింది అనేది ఈ సినిమా మిగిలిన స్టోరీ.
Papa OTT: పెళ్లికి ముందు పేరెంట్స్ అయితే.. మరో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ!
