`ఇస్మార్ట్ శంక‌ర్‌` స్క్రిప్టు లీక్, పోలీసుల‌ను ఆశ్ర‌యించిన పూరి !

యంగ్ హీరో రామ్ హీరోగా డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ఇస్మార్ట్ శంక‌ర్‌ సినిమాను తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. పూరీ జ‌గ‌న్నాథ్‌, న‌టి ఛార్మి ఈ సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగతి తెలిసిందే.

ఈ స‌మ‌యంలో ఈ చిత్ర యూనిట్‌కు షాక్ త‌గిలింది. ఈ సినిమా స్క్రిప్టు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ముర‌ళీ కృష్ణ అనే వ్య‌క్తి త‌మ సినిమా స్క్రిప్టును `బ‌జ్ బాస్కెట్‌` ఇన్‌స్టాగ్రామ్ గ్రూపులో పోస్ట్ చేసిన‌ట్టు ఛార్మి హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

ఇన్‌స్టాగ్రామ్ నుంచి త‌మ సినిమా స్క్రిప్టును తీసేసేందుకు భారీ డ‌బ్బు డిమాండ్ చేస్తున్న‌ట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణకు సిద్ధ‌మ‌వుతున్నారు.