నటి ప్రగతితో అసభ్యంగా ప్రవర్తించిన స్టార్ కమెడియన్ ఎవరు?

క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి తెలియని వారుండరు టాలీవుడ్ లో. సినిమాలో హీరోలకి, హీరోయిన్లకు తల్లి పాత్రలు చేస్తూ ప్రేక్షకులకి బాగా దగ్గర అయ్యింది ఈ నటి. సుమారు 18 సంవత్సరాల నుండి ఎక్కువగా తల్లి పాత్రలు చేస్తూ అందమైన తల్లిగా గుర్తింపు పొందింది. ప్రగతి అంటే ‘యంగ్ మదర్’ అనే ట్యాగ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీలో ప్రగతికి మంచి పేరుంది. ఇలాంటి ప్రగతితో ఒక స్టార్ కమెడియన్ మిస్ బిహేవ్ చేశాడట. మీ పద్దతి బాలేదు అని మొహం మీదే చెప్పేసిందట ప్రగతి ఈ విషయాలన్నీ ఒక వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది ప్రగతి.

ఎన్నో ఏళ్లుగా ఆ వ్యక్తితో కలిసి పని చేశాను. నాతో మంచిగా ఉండేవారు. నాతో ఎప్పుడూ ఆ మనిషి ప్రవర్తన చెడుగా లేదు. కానీ ఒక రోజు మూవీ సెట్లో ఆయన నాతో ప్రవర్తించిన తీరు కొత్తగా అనిపించింది. ఏంటి ఈయన ఇలా చేశారు, ఆయన బిహేవియర్ సరిగాలేదు అని ఆలోచిస్తూ నాలో నేనే మదన పడుతున్నాను. అది ఉదయం 11:30-12:00 గంటల సమయంలో జరిగింది. నేను అది జరిగిన తర్వాత లంచ్ చేయలేకపోయాను, సాయంత్రం టీ కూడా తాగలేక పోతున్నాను. ఆయనకి ప్యాకప్ చెప్పేశారు. నా షూటింగ్ ఇంకా ఉంది. ఆయన బయలుదేరుతుండగా ఒకసారి మీతో మాట్లాడాలి అని క్యారవ్యాన్ లోకి తీసుకెళ్ళాను.

సూటిగా ఆయనను ఇలా ప్రశ్నించాను…”నేను ఎప్పుడైనా మీతో మిస్ బిహేవ్ చేశానా? నాకే తెలియకుండా కను సైగలతో కానీ, నా బాడీ లాంగ్వేజ్ తో కానీ మిమ్మల్ని ఆహ్వానించానా? అని అడిగాను. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావ్ అలాంటిదేమి లేదు అని అన్నారు ఆయన. మరి అదేంటండి అలా మాట్లాడారు నాతో. అలా మాట్లాడటం సరి కాదు కదా.. ఒకవేళ నేను అప్పుడే రియాక్ట్ అయితే ఏంటి మీ పరిస్థితి? మీరు అలా చేయరు అనే నమ్మకంతోనే మీతో మాట్లాడుతున్నాను అలాంటప్పుడు మీ పద్దతి ఇలా ఉండకూడదు. మీరు కాబట్టి అక్కడ ఏమీ మాట్లాడకుండా…ఒకసారి నా సైడ్ నుండి ఏదైనా తప్పు సిగ్నల్స్ ఇచ్చానేమో కనుక్కుని తర్వాత మాట్లాదోచు అని ఊరుకున్నాను. ఇంకెప్పుడు నాతో అలా బిహేవ్ చేయకండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను” అని చెప్పింది ప్రగతి. తరువాత ఆ స్టార్ కమెడియన్ ప్రగతి యాటిట్యూడ్ చూపిస్తుందని, పొగరు కూడా ఎక్కువ అని ఇండస్ట్రీలో ఆమె గురించి చెడుగా ప్రచారం చేశాడట. ఇంత చెప్పి ఆ సీనియర్ కమెడియన్ పేరు మాత్రం బయట పెట్టలేదు ప్రగతి.