బోయపాటికి ఎన్టీఆర్ ఫోన్ కాల్? కారణం ఏంటి

క్రేజీ ప్రాజెక్టులు ప్రారంభం అయ్యేటప్పుడు రకరకాల సమస్యలు వస్తూంటాయి. ముఖ్యంగా ఎక్కువ డేట్స్ లాక్ చెయ్యాలనుకున్నప్పుడు అయితే మరీను. ఇప్పుడు అదే పరిస్దితి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు వచ్చిందని తెలుస్తోంది. అయితే ఆ సమస్య బోయపాటి శ్రీను వైపు వచ్చిందని , అందుకే ఎన్టీఆర్ ..ఆయనకు పోన్ చేసాడని ఫిల్మ్ నగర్ టాక్.

వివరాల్లోకి వెళితే.. రీసెంట్ గా ఎన్టీఆర్ …బోయపాటి శ్రీను కు ఫోన్ చేసారని తెలుస్తోంది. ఎందుకంటే బోయపాటి తన తాజా చిత్రం ఆలస్యం చేయటంతో రామ్ చరణ్ అక్కడే లాక్ అయ్యిపోయారు. రామ్ చరణ్ వస్తే కానీ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి చిత్రం ప్రారంభం కాదు.

బోయపాటి సాధారణంగా స్పీడుగా ప్రాజెక్టులు ఫినిష్ చేస్తూంటారు. అయితే రకరకాల కారణాల వల్ల రామ్ చరణ్ తో చేయబోతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా లేటు అవుతూ వస్తోంది. దాంతో ఆ ఇంపాక్ట్ తమపై పడకూడదని బోయపాటి కు ఫోన్ చేసి చెప్పాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే వేరే వారి ప్రాజెక్టులలో ఇన్వాల్వ్ అయ్యే మనస్తత్వం కాదు తారక్ ది. కాబట్టి ఇది గాసిప్పే అవవ్చు అని కొందరంటున్నారు. అయితే బోయపాటితో ఉన్న చనువుతో చెప్పి ఉండే అవకాసం ఉందంటున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్‌ను ఈ ప్రాజెక్ట్‌కు తగ్గట్టుగా మలచడానికి లాయిడ్‌ స్టీవెన్‌ రంగంలోకి దిగాడు. డిసెంబర్‌లో షూటింగ్‌ మొదలుకానున్నట్లు సమాచారం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు జాతీయ స్థాయిలో బజ్‌ ఏర్పడింది. బాహుబలి తరువాత దర్శక ధీరుడు రాజమౌళి.. ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేసిన్పటినుంచీ సినీ అభిమానులు దీని గురించి చర్చిస్తూనే ఉన్నారు. ఇంతవరకు అధికారిక ప్రకటన రాకపోయినా సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.