ఇదీ అస‌లైన బ‌యోపిక్‌! ఎన్టీఆర్ క‌ళ్ల‌ల్లో క్షోభ‌, అభ‌ద్ర‌తా భావం!

రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్`లో ఎన్టీఆర్ లుక్ శుక్ర‌వారం సాయంత్రం విడుదలైంది. దీనికి సంబంధించిన యూట్యూబ్ లింక్‌ను రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ గెట‌ప్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ ఎంత వ‌ర‌కు స‌రిపోయారో గానీ.. ఈ మూవీలో మాత్రం ఎన్టీఆర్ పాత్ర‌ధారికి నూటికి నూరు మార్కులు ఇవ్వొచ్చు.

త‌న చివ‌రి రోజుల్లో ఎన్టీఆర్ ఎలాంటి క్షోభ‌ను అనుభ‌వించారో, ఎలాంటి అభ‌ద్రతా భావానికి లోన‌య్యారో..నిమిషం పాటు నిడివి ఉన్న ఈ లుక్‌లో చూపించారు. లావుపాటి న‌ల్ల క‌ళ్ల‌ద్దాల వెనుక ఎన్టీఆర్ క‌ళ్ల‌ల్లో నీళ్లు క‌నిపించిన స‌న్నివేశం.. సినిమా డెప్త్ ఎలాంటిదో స్ప‌ష్టం చేస్తోంది.

రామ్‌గోపాల్ వ‌ర్మ ఎంత క‌సిగా ఈ సినిమా తీశాడ‌నే విష‌యం ఇక్క‌డ తెలిసిపోతోంది. `ఎన్టీఆర్ బిక‌మ్స్ అలైవ్ ఇన్ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` అనే ట్యాగ్‌కు నూరుశాతం న్యాయం చేశాడు ఆర్జీవీ. ఎన్టీఆర్ క‌న్నుమూసిన రోజే ఆయ‌న లుక్‌ను విడుద‌ల చేశారాయ‌న‌. క‌ల్యాణిమాలిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ స‌న్నివేశాన్ని మ‌రింత ఎలివేట్ చేసింది.

NTR Becomes Alive in Lakshmi’s NTR | RGV | GV Films | Rakesh Reddy