‘నోటా’టాక్ ,స్టోరీ లైన్

                                                          (సూర్యం)

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మెహ్రీన్ జంటగా నటించిన  చిత్రం నోటా. ఈ రోజు విడుదల అవుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.   తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమా ఇప్పటికే విదేశాల్లో షోలు పడ్డాయి. ఇప్పటికే చూసిన వారి నుంచి అందుతున్న సమాచారం మేరకు…ఈ సినిమా పూర్తిగా సీరియస్ నోట్ తో పొలిటికల్ డ్రామా గా సాగుతుంది. గీతా గోవిదం చూసిన కళ్ళతో ఈ సినిమా చూస్తే
నచ్చకపోవచ్చు.  ఓ అవినీతి ముఖ్యమంత్రి తన కుమారుడుని తాత్కాలిక సీఎం ని చేయటం, తదనంతర పరిణామాల చుట్టూ సినిమా సాగుతుంది. విజయ్ ఇమేజ్ కు ఈ సినిమా ఫిట్ కాలేదు అంటున్నారు.

ఇమేజ్ అనేది ప్రక్కన పెట్టి కథ,కథనం వంటి విషయాలు చూసినా అంత గ్రిప్పింగ్ నేరేషన్ తో సాగలేదని చెప్తున్నారు. ఫస్టాఫ్ జస్ట్ పాస్. సెకండాఫ్ పూర్తిగా తమిళ ప్లేవర్ తో సాగింది. పొలికల్ వ్యవహారం మొత్తం తమిళనాట రాజకీయాలను గుర్తు చేస్తూ సాగుతుంది. అయితే పాటలు బాగున్నాయి. హీరోయిన్ థ్రెడ్ బాగుంది. అయితే ఓ సాదా  ప్రేక్షకుడు ఆశించే ఎలిమెంట్స్ అయితే మిస్ అయ్యాయి అని చెప్తున్నారు. మరి కొద్ది సేపట్లో ఎలాగో రివ్యూ అందిస్తాం.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్‌లో ఈ సినిమా సత్తా చూపించింది. తొలి రోజుకు ముందస్తు బుకింగ్స్ విషయంలో ప్రేక్షకులు పోటీలు పడ్డారు. థియేటర్ల విషయంలో కూడా ఇది భారీ సంఖ్యలో విడుదల అవుతోంది.  జ్ఞానవేల్ రాజా నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, సామ్.సి.సుందర్ సంగీతం అందించారు.

నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ ‘విజయ్ నటించిన గీత గోవిందం సినిమా తమిళనాడులో రిలీజ్ చేసాం. మాములు రెస్పాన్స్ రాలేదు. నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టిన సినిమా గీత గోవిందం. ఏ హీరోకి ఇలాంటి రికార్డులను సాధించడం సాధ్యం కాలేదు. ఒక్క విజయ్‌కే అది దక్కింది.’ అన్నారు