మోక్ష‌జ్ఞని తెర‌కు ప‌రిచ‌యం చేసేది ఆయ‌నే!

న‌ట‌సింహా బాల‌కృష్ణ వార‌సుడు మోక్ష‌జ్ఞ సినీఎంట్రీ ఎప్పుడు? అస‌లు హీరో అవుతాడా లేదా? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కోసం చాలా కాలంగా నంద‌మూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. గ‌త మూడు నాలుగేళ్లుగా మోక్ష‌జ్ఞ ఎంట్రీపై ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం సాగుతున్నా ఇప్ప‌టివ‌ర‌కూ స‌రైన క్లారిటీ రానే లేదు.

అస‌లు సినీ హీరో అయ్యే ఆలోచ‌నే మోక్ష‌జ్ఞ‌కు లేద‌ని అందుకే అత‌డు అనాస‌క్తితో దూరం దూరంగా ఉంటున్నాడ‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. మోక్షు బొద్దుగా ఉన్న కొన్ని ప్ర‌యివేటు ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. దీంతో ఇక మోక్ష‌జ్ఞ హీరో అవ్వ‌డ‌నే అనుకున్నారంతా.

కానీ ఇంత‌లోనే సీన్ మారింది. ప్ర‌స్తుతం మోక్ష‌జ్ఞ శిక్ష‌ణ‌లో ఉన్నాడ‌ట‌. బ‌రువు త‌గ్గి రూపం మార్చుకుంటున్నాడు. అలాగే న‌ట‌న ప‌రంగా మెరుగులు దిద్దుకుంటున్నాడ‌ట‌. పైగా బాల‌కృష్ణ స్వ‌యంగా వార‌సుడిని హీరోని చేసే బాధ్య‌త‌ను స్టార్ రైట‌ర్ బుర్రా సాయిమాధ‌వ్ కి అప్ప‌జెప్పాడ‌ట‌. ప్ర‌స్తుతం సాయి మాధ‌వ్ మోక్ష‌జ్ఞ ఎంట్రీ మూవీ కోసం స్క్రిప్టును రెడీ చేస్తున్నార‌ట‌. లాక్ డౌన్ ప‌రిమితిపై స‌డ‌లింపు వ‌చ్చింది కాబ‌ట్టి దీనిపై ఏదైనా అధికారికంగా ప్ర‌క‌టించే వీలుంద‌ని తెలుస్తోంది. అయితే సాయిమాధ‌వ్ కానీ.. బాల‌య్య టీమ్ కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా చేయ‌లేదింకా.