నాగబాబు కామెంట్ కు బాలయ్యకు బాగా కాలి…

నాగబాబు మరో వివాదంలో ఇరుక్కున్నారు. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు తో చేసిన ఇంటర్వూలో ఆయన ..బాలయ్య పై చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. బాల‌య్య అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని చెప్పి సంచ‌ల‌నం షాక్ ఇచ్చాడు. కొన్ని రోజులుగా టీడిపికి.. జ‌న‌సేన‌కు మ‌ధ్య మాటల యుద్ధం జరుగుతుంది.

ఈ నేపధ్యంలో ..నాగబాబును బాలయ్య గురించిన ప్ర‌శ్న అడిగారు ప్రభు. దానికి నాగ‌బాబు కూడా ఎవ‌రూ ఊహించ‌ని స‌మాధానం చెప్పాడు. త‌న‌కు బాలకృష్ణ ఎవరో తెలియదని చెప్పాడు.

ఆ బాల‌య్య అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని చెప్పాను క‌దా.. అంటూనే సారీ సారీ తెలుసు.. ఆయ‌న గురించి నాకు తెలుసు.. బాలయ్య చాలా పెద్ద ఆర్టిస్టు. సీనియర్ మోస్ట్ నటుడు. అప్పట్లో నేరము-శిక్ష లాంటి సినిమాల్లో కృష్ణ, బాలయ్య కలిసి న‌టించారంటూ చెప్పాడు. ఆ బాల‌య్య కాదండి.. ఇప్పుడు మేం అడుగుతున్న‌ది నందమూరి బాలకృష్ణ గురించి అని ప్రభు అడిగితే.. ఆ త‌రం బాల‌య్య తెలుసు కానీ ఈ త‌రంలో ఎవ‌రో తెలియ‌ద‌ని చెప్పి ఆశ్చర్యపరిచారు నాగబాబు.

బాల‌య్య ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల ఇగోపై దెబ్బ‌కొట్టారు నాగ‌బాబు. త‌న‌కు జనసేన పార్టీలో ఓ నాయకుడిగా కంటే సామాన్య కార్యకర్తలా పనిచేయడం తనకు ఇష్టమని ఆ ఇంటర్వూలో తెలిపాడు. మొత్తానికి నాగ‌బాబు చెప్పిన మాట‌లు అటు తెలుగుదేశం వ‌ర్గాల్లో కూడా హాట్ టాపిక్ అయ్యాయి. అంతటా వైరల్ గా మారాయి. ఈ కామెంట్ విన్న బాలకృష్ణ చాలా కోప్పడ్డారని సమాచారం. ఆయన కూడా అతి త్వరలో ఈ విషయమై కౌంటర్ వేస్తారని అంతా భావిస్తున్నారు.