నిర్మాత వివాహ రిసెప్షన్ లో మహేష్, నాని

పిల్లా నువ్వు లేని జీవితం, లవర్ చిత్రాల నిర్మాత హర్షిత్ రెడ్డి వివాహం మూడు రోజుల క్రితం అంటే 21 తేదీన గోవాలో తెల్లవారుఝామున 3 గంటలకు వివాహం జరగిన సంగతి తెలిసిందే. హర్షిత్ మరెవరో కాదు..సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుని కుమారుడే. ఆయన వివాహం చేసుకున్న అమ్మాయి పేరు గౌతమి. ఆమె ఆదోని వైసీపీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి కుమార్తె. ఇదొక డెస్టినేషన్ మ్యారేజ్.

వివాహానంతరం నిన్న 23వ తేదీన రిసెప్షన్ గ్రాండ్ గా ఇచ్చారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు సన్నిహితులైన వారందరికీ   ఆహ్వానాలు వెళ్లాయి.  దాదాపు పిలిచిన వారంతా వచ్చి వధూవరులను దీవించారు.


ఈ రిసెప్షన్ లో మహేష్ బాబు, నాని, రాశి ఖన్నా, కెవిపి రామ చంద్రరావు, కిరణ్ కుమార్ రెడ్డి, సి అశ్వనీదత్, వంశీ పైడిపల్లి వంటి సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అని , ఈ వివాహానికి వైయస్ ఆర్పీకు చెందిన కొందరు ఎమ్మల్యేలు హాజరు అయిన్నట్లు తెలుస్తోంది.హర్షిత్ పెళ్లి సందడితో దిల్ రాజు ఇల్లు బంధువులతో కళకళలాడుతోంది.