ఆల్బర్ట్‌ హాల్‌ లో వరల్డ్‌ ప్రీమియర్‌ షో కి బాహుబ‌లి టీం !

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంత‌రాలు దాటించిన చిత్రం బాహుబ‌లి. రెండు పార్ట్‌లుగా వచ్చిన ఈ చిత్రం అనేక రికార్డుల‌ని త‌న ఖాతాలో వేసుకుంది. ఇప్పటికీ బాహుబ‌లి హ‌వా కొన‌సాగుతూనే ఉంది. తాజాగా చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ధారులైన ప్ర‌భాస్‌, అనుష్క‌, రానాల‌తో పాటు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణిల‌కి రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్ నుండి ఆహ్వానం అందింది. లండన్‌లోని రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ఈ సినిమా వరల్డ్‌ ప్రీమియర్‌ లైవ్‌ను ప్ర‌ద‌ర్శించ‌నుండ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర బృందం హాజ‌ర‌వుతున్న‌ట్టు రాయ‌ల్ ఆల్బ‌ర్ట్ హాల్ త‌న ట్వీట్‌లో తెలిపింది. ‘బాహుబలి: ది బిగినింగ్‌’ ప్రీమియర్‌ అక్టోబరు 19న సాయంత్రం 7 గంటలకు జరగబోతోంది. అక్క‌డ చిత్రానికి సంబంధించి ప‌లు విష‌యాల‌ని చిత్ర బృందం షేర్ చేసుకోనున్నారు.