Rajamouli : రాజమౌళి సైలెంట్ సర్‌ప్రైజ్.. బాహుబలి రీ ఎడిట్ వెర్షన్?

తెలుగు సినిమా దిశను మార్చిన ‘బాహుబలి’ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరిగిపోని అద్భుతం. ఇప్పుడు అదే బాహుబలి తిరిగి థియేటర్లలోకి రానుందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కానీ ఇది కేవలం రీ రిలీజ్ మాత్రమే కాదు, పూర్తిగా కొత్త అనుభూతి కలిగించేలా రూపొందించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ స్పెషల్ ఎడిట్ వెర్షన్ వెనుక ఉన్న ప్లాన్ ఆసక్తికరంగా మారుతోంది.

‘బాహుబలి: ది బిగినింగ్’ మరియు ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాలు విడివిడిగా విడుదలై రెండూ కలసి భారత సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచాయి. కానీ ఇప్పుడు మేకర్స్ రెండు భాగాల నుంచి అత్యంత ఆసక్తికరమైన ఎపిసోడ్లను ఎంపిక చేసి, వాటిని కలిపి ఒకే సినిమాలోగా తయారు చేయాలని భావిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే ఎడిటింగ్ పనులు ఆర్క మీడియా వర్క్స్ అధ్వర్యంలో మొదలయ్యాయని సమాచారం.

ఇక్కడ మరొక ఆసక్తికర అంశం ఉంది. బాహుబలి రెండు భాగాలు కలిపితే దాదాపు ఐదు గంటల నిడివి ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్త వెర్షన్‌ను మూడు నుంచి మూడున్నర గంటల వరకే కుదించాలని చూస్తున్నారు. ఈ కుదింపుతో కథనాన్ని మరింత సంక్షిప్తంగా, రివైజ్ చేసిన అనుభూతితో తీర్చిదిద్దే అవకాశముంది. ఈ ప్రక్రియలో దర్శకుడు రాజమౌళి స్వయంగా సూచనలు ఇచ్చే ఛాన్స్ ఉందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.

అప్పట్లో ‘బాహుబలి’ని రెండు భాగాలుగా విడదీయడంపై కొందరు విమర్శలు చేశారు. కథను అర్ధాంతరంగా చూపించారనే అసంతృప్తి ఉండేది. ఇప్పుడు ఒకే సినిమాలో మొత్తం ప్రయాణాన్ని చూపించే ఈ కొత్త వెర్షన్ ఆ అసంతృప్తిని తీర్చే అవకాశముంది. ఇదే టైమ్‌లో కొత్త తరం ప్రేక్షకులకు మరోసారి భారీ స్క్రీన్‌పై ఈ మహా గాథను చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రణాళిక కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

Bharadwaj EXPOSES Sale Purchase Secrets | Chandrababu | Exclusive Interview | Telugu Rajyam