హైదరాబాద్ లో కరోనా వైరస్ వ్యాప్తి గురించి చెప్పాల్సిన పనిలేదు. అందర్నీ చుట్టేస్తోంది. సామాన్య జనం, ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు, మీడియా ప్రతినిధులు ఇలా ఎవర్నీ వదిలి పెట్టలేదు. అందరికీ కరోనా అంటుకుంది. ఈ నేపథ్యంలో వైరస్ అనుమానం ఉన్నవాళ్లంతా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఉన్న వాళ్లకి పాజిటివ్..లేని వాళ్లకి నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చినా సమాచార లోపంతో పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని విమర్శించి వార్తలొకి వచ్చి, ఆ క్రేజ్ తో బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకుని ఫేమస్ అయిన కత్తి మహేష్ కి కూడా కరోనా వచ్చిందంటూ ప్రచారం సాగింది.
టాలీవుడ్ లో కాస్తా..కూస్తో ఆయనికి పేరు ఉంది కాబట్టి ఆ వార్తపై ఆసక్తి పెరిగింది. అయితే ఈ రూమర్ పై కత్తి మహేష్ సీరియస్ అయ్యాడు. తనకు కరోనా అంటుకోలేదని….కానీ కరోనా సోకిందని ప్రచారం చేసారని మండిపడ్డాడు. ఇలాంటి లేనిపోని కథనాలు ఎలా రాస్తారన్నాడు. అలాగే ఆవార్తల్ని ట్రోల్ చేసిన వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఇలాంటి ప్రచారాలకు పూనుకుంటే చట్ట పరంగా చర్యలు దిగుతానని హెచ్చరించాడు. తాను మీడియాలో ఉన్నందున కొద్ది రోజుల క్రితమే మీడియా మిత్రులు అందరితో పాటు తాను కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నానని, రిపోర్ట్ నెగిటివ్ వచ్చిందని వివరణ ఇచ్చాడు.
ఇకపై ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని..తనని ఆటపట్టించే ఉద్దేశం ఉంటే నేరుగా తన ముందుకొచ్చి ఆటపట్టించడని తెలిపాడు. అన్నట్లు కత్తి మహేష్ కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. పెసరట్టు అనే ఓ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. కానీ ఎక్కడా సక్సెస్ అవ్వలేదు. అలాగే యాక్టింగ్ కి సంబంధించి ట్రెయినర్ గా కూడా పనిచేసాడు. అప్పట్లో అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్వహించిన ఫిల్మ్ ఈవెంట్ కార్యక్రమంలోనే కత్తి మహేష్ లో ఈ ట్యాలెంట్ కూడా ఉందని బయటకు వచ్చింది.