ఇంత కాలం జనసేనాని పవన్ కల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ వచ్చిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి తాజాగా రామ్‌చరణ్ ని లక్ష్యంగా చేసుకోవడం మెగాభిమానుల్లో చర్చకు వస్తోంది. ఓవైపు మెగాస్టార్‌ని పొగిడేస్తూనే ఆయన వారసుడు మెగాపవర్‌స్టార్‌ని పరోక్షంగా కించపరచడం చర్చనీయాంశంగా మారింది.
“అందం.. అభినయం.. డాన్సుల్లో మెగాస్టార్ చిరంజీవిని అందుకోవడం ఎవరి వల్లా కాదు. చిరంజీవిగారి తరవాత తెలుగు ఇండస్ట్రీలో గొప్ప నటుడు ఎన్టీఆర్ గారు. ఆ తరువాతే రామ్‌చరణ్” అని ట్విట్టర్ వేదికగా అభిప్రాయం వెల్లడించి రచ్చకు తెరలేపింది. దీంతో శ్రీరెడ్డిపై మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. అవసరం లేకపోయినా ఏదో ఒక కోణంలో వివాదాన్ని కెలకడంలో శ్రీరెడ్డి దిట్ట. వివాదాలతోనే పాపులర్ అవుతున్న శ్రీరెడ్డి ఇటీవల బిగ్ బాస్ సీజన్ సందర్భంగా నాగార్జునపై లైంగిక వేధింపులకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ అందులోనూ మెగా వారసుడిని కించపరుస్తూ శ్రీరెడ్డి ట్విట్టర్ వేదికగా కామెంట్లు చేయడం వివాదాస్పదం అవుతోంది.
దీనిపై మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో శ్రీరెడ్డిపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ఎవరి ఫేవరేట్ స్టార్ వారికి గొప్పగానే కనిపిస్తారు. అయినా అలా చెప్పడానికి నువ్వు ఎవరు? నీ స్థాయి ఏంటి? మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో కనీసం సభ్యత్వం కూడా సాధించలేని అధమమైన పరిస్థితిలో వున్ననువ్వు తెలుగు చిత్ర పరిశ్రమని.. యావత్ భారతీయ చలన చిత్ర పరిశ్రమ ముందు తలదించుకునేలా చేశావు. అలాంటి నీకు మా మెగా హీరోని విమర్శించే అర్హత లేదని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో శ్రీరెడ్డిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదంతా శ్రీరెడ్డి యూట్యూబ్ చానెల్ ని ప్రమోట్ చేసుకునేందుకు ఆడుతున్న నాటకంగా అభివర్ణిస్తున్నారు. వివాదాలతో ప్రచారం ఆపాలంటూ వార్నింగులు ఇస్తున్నారు.