‘మీటూ’ అరోపణలు ఎదుర్కోంటున్న హీరో అర్జున్ సర్జాకు హైకోర్టులో కొద్దిపాటి ఊరట కలిగింది. శ్రుతిహరిహరన్ ఫిర్యాదుతో దాఖాలైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని అర్జున్ సర్జా దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టి డిసెంబర్ 11కు వాయిదా వేసింది. అప్పుటి వరకు అర్జున్ పై ఏలాంటి చర్యలు తీసుకోరాదని పోలీసులకు సూచించింది.
యాక్షన్‌కింగ్‌గా పేరుతెచ్చుకున్న అర్జున్ మీటూలో చిక్కుకున్నాడు. నిపుణన్ చిత్రంలో నటిస్తున్న సమయంలో అర్జున్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆ చిత్ర హీరోయిన్ శ్రుతీహరిహరన్ చేసిన ఆరోపణలు కలకలానికి దారి తీయడంతో పాటు నటుడు అర్జున్ ఇమేజ్‌ను డామేజ్ చేశాయి.
అయితే శ్రుతీహరిహరన్ ఆరోపణల్లో నిజం లేదంటూ అర్జున్ పేర్కొనడంతో పాటు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నటి శ్రుతీహరిహరన్ కూడా ఫిర్యాదు చేసింది. వీరిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి కన్నడ సినీ ప్రముఖులు కొందరు రాయబారం నడిపినా ఫలితం లేకపోయింది.
ఈ నేఫద్యంలో శ్రుతి ఆరోపణలతో పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారోనన్న భయంతో నటుడు అర్జున్ బెంగళూర్ కోర్టులో ముందస్తు బెయిల్ పొందారు. అయినా అర్జున్‌ను వదిలేది లేదంటోంది శ్రుతీహరిహరన్. తాను అర్జున్‌పై చేసిన ఆరోపణలకన్నింటికీ ఆధారాలున్నాయని అంది. ఆయనపై ఫిర్యాదు చేసినందుకుగానూ తనపై అర్జున్ కేసు వేశారని చెప్పింది. దాన్ని తాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని, అదే విధంగా తాను చేసిన ఆరోపణలకు కోర్టులో ఆధారాలను సమర్పిస్తానని అంది.