బ్యాచిలర్ లైఫ్ కి బై, బై.. ఈ సంవత్సరం పెళ్లి చేసుకున్న సినీ సెలబ్రిటీస్!

2024వ సంవత్సరం అప్పుడే వెళ్ళిపోతుంది. వెనక తిరిగి చూస్తే బోలెడన్ని ఆనందాలు, బోలెడన్ని కష్టాలు అలాగే బోలెడన్ని సినిమాలు. సినిమాలు మన జీవితంలో విడదీయని ఒక భాగం అయిపోయింది. అందుకే మరో మూడు రోజుల్లో న్యూ ఇయర్ లో అడుగు పెట్టబోతున్న మనం ఈ సంవత్సరంలో పెళ్లి పీటలెక్కిన సినీ తారలు ఎవరో ఒకసారి చూద్దాం. తీన్మార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతికర్బంద తన ప్రియుడు పులకిత్ సామ్రాట్ తో ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిపోయింది.

అలాగే కలర్ ఫోటో సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్ ఆ సినిమాలోని ఒక రోల్ పోషించిన చాందినీరావుని ఈ సంవత్సరమే పెళ్లి చేసుకున్నాడు. అలాగే లై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మేఘా ఆకాష్ తన ప్రియుడు సాయి విష్ణు ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అలాగే ప్రముఖ హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ పెళ్లి తమిళ స్టార్ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు నటుడు ఉమాపతితో జరిగింది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అలాగే డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ సంవత్సరమే డాక్టర్ రమ్యని రెండో పెళ్లి చేసుకున్నారు. అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ తన చిన్ననాటి ఫ్రెండ్ ఆంటోనీ ని ఈ మధ్యనే వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ సంవత్సరమే తన చిరకాల ప్రియుడు నికోలాయి సచ్ దేవ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అలాగే హీరోయిన్ తాప్సీ కూడా ఈ సంవత్సరమే డెన్మార్క్ మాజీ బ్యాట్మెంటన్ ప్లేయర్ మాథియాస్ బోయ్ ని పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ ని ప్రారంభించింది. అలాగే రాజావారు రాణి వారు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ లు కూడా ఈ సంవత్సరమే పెళ్లి చేసుకున్నారు. అలాగే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జాకి బగ్నానిని, హీరో సిద్ధార్థ హీరోయిన్ అతిథి రావు హైదరి ని, నాగచైతన్య సోబితని, కీరవాణి కొడుకు శ్రీ సింహ రాగా మాగంటిని ఈ సంవత్సరమే పెళ్లి చేసుకుని ఒక ఇంటి వారు అయ్యారు.