తమిళ సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖ కమెడియన్ మరియు స్క్రీన్ రైటర్ క్రేజీ మోహన్ ఈ రోజు మధ్యాహ్నం గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయనకు గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని దగ్గరలోని కావేరి హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్లు ఆయన్ను కాపాడడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఆయన రెండు గంటలకు కన్నుమూశారు. ఈ విషయాన్ని హీరో సిద్దార్ద ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.
https://twitter.com/Actor_Siddharth/status/1138004924560683008
అపూర్వ సోదరులు, మైకేల్ మదన కామరాజు, సతీలాలావతి, తెనాలి, పంచతంత్రం, కాదల కాదల, భామనే సత్యభామనే, వసూల్‌రాజా తదితర చిత్రాల్లో కామెడీ పాత్రలతో నటించి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఈయన మృతికి తెలుగు రాజ్యం సంతాపాన్ని తెలియజేస్తోంది.