ఆ హీరోలను చూసి నేర్చుకో… చిరంజీవికి సలహాలు ఇస్తున్న నేటిజన్స్… ఏమైందంటే?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఈయన వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మాస్ మసాలా ఎంటర్టైర్నర్ తో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ కూడా కీలకపాత్రలో నటించడం విశేషం అయితే ఈ సినిమా చూసినటువంటి అభిమానులు ఒకింత నిరాశకు లోనవుతున్నట్టు తెలుస్తుంది.

చిరంజీవి ఈ తరహా సినిమాలను ఆయన గత 20 సంవత్సరాల క్రితమే చేశారు. అయినప్పటికీ ప్రస్తుతం కూడా అదే తరహా కథలను ఎంపిక చేసుకొని నటిస్తుండడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతర భాషలలో చిరుతో సమానంగా ఉన్నటువంటి రజనీకాంత్, కమల్ హాసన్, ముమ్ముట్టి, మోహన్లాల్ వంటి హీరోల తరహాలో కథలను ఎంపిక చేసుకొని నటిస్తే బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆ హీరోల మాదిరిగా మీరు మీ వయసుకు తగ్గ కథలను ఎంపిక చేసుకొని నటిస్తే బాగుంటుందని అలా కాకుండా ఇలా కుర్ర హీరోలు చేసే సినిమాలను చేయడం ఏమాత్రం బాలేదు అంటూ వాల్తేరు వీరయ్య సినిమాపై కొందరు అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం అభిమానులు చిరంజీవి సినిమాల గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.